అర్థరాత్రి వరకు ఎక్కువ రోజులు మేల్కొంటే.. గుండెపోటు వస్తుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

అర్థరాత్రి వరకు ఎక్కువ రోజులు మేల్కొంటే.. గుండెపోటు వస్తుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

గుండెపోటు..ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా  సంభవిస్తున్న మరణాలకు ఓ ప్రధాన కారణం. చిన్న పిల్లలనుంచి వృద్దుల వరకు వయసుతో సంబంధం లేకుండాగుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మరణాలు  సంభవించాయని WHO లెక్కలు చెబుతున్నాయి. గుండెపోటు, స్ట్రోక్స్ రెండింటీకీ మనం  తీసుకునే ఆహారం,శారీరక శ్రమ, నిద్ర వంటివి కారణమని డాక్టర్లు చెబుతున్నా.. ప్రధాన కారణం నిద్రలేకపోవడం, పొగత్రాగడం అని తాజా పరిశోధనల్లో తేలింది. ఆలస్యంగా నిద్ర పోయే వారిలో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. 

జర్నల్ ఆఫ్ ది అమెరికన్  హార్ట్ అసోషియన్ లో ప్రచురించిన ఈ అధ్యయనంలో రాత్రి వేళల్లో పనిచేసే వారికి  గుండె జబ్బులు, కార్డియాక్ అరెస్టులపై పరిశోధనలు చేశారు. ఎక్కువ రోజులు రాత్రిళ్లు మేల్కొని వర్క్ చేసేవారిలో 79 శాతం హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

రాత్రి సమయాల్లో పనిచేసేవారు గుండె ఆరోగ్యంపై ఎక్కువగ శ్రద్ద చూపాలని సూచిస్తున్నారు పరిశోధకులు. గుండె ప్రమాదాలను తగ్గించడానికి బీపీ, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు, శారీరక శ్రమ, శరీర బరువు, ఆహారం,నిద్ర ఆరోగ్యం వంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు.

తగినంత నిద్రకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. నిద్ర, మేల్కొనే సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలంటున్నారు. ఉదయం వేళల్లో వెలుతురులో కొంత సమయం గడపాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం,వీటితోపాటు బీపీ, కొలెస్ట్రరాల్,రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుంటున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..పొగతాగడం పూర్తిగా మానేయాలని ,ఇది అత్యంత కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు.