సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో అదరగొట్టింది. న్యూజిలాండ్ పై ఇటీవలే టీ 20 సిరీస్ లో అదరగొట్టిన టీమిండియా అదే ఫామ్ ను వరల్డ్ కప్ వార్మప్ లోనూ ప్రదర్శించింది. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ కిషాన్ దంచి కొట్టాడు. 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔటయ్యాడు. ప్రతి ఒక్కరు బ్యాటింగ్ లో అదరగొట్టడం విశేషం.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి ఓవర్లోనే కిషాన్ రెండు సిక్సర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు బాది తన దూకుడు చూపించాడు. ఐదో ఓవర్లో కిషాన్ విధ్వంసమే సృష్టించాడు. ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. వీరిద్దరి ధాటికి ఇండియా పవర్ ప్లే లో ఏకంగా 83 పరుగులు చేసింది. 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔటయ్యాడు. ఓపెనర్ల తర్వాత తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ షో సాగింది.
వీరిద్దరి ధాటికి 9 ఓవర్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు వచ్చాయి. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి తిలక్ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కూడా వేగంగా ఆడి 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. 23 బంతుల్లో 35 పరుగులు చేసి రాణించాడు. హార్దిక్ పాండ్య అయితే నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్ తో కిక్ ఇచ్చాడు. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి చివర్లో రెచ్చిపోయి ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్ తో ఇండియా స్కోర్ 240 పరుగులకు చేరుకుంది. సంజు శాంసన్ ను బ్యాటింగ్ ను దించలేదు.
