కొంతమంది వయసుమీద పడుతున్నా యంగ్‌గా కనిపిస్తుంటారు. అలా ఉండాలంటే హెల్దీ లైఫ్‌స్టయిల్ మెయింటెయిన్ చేయాలి. అయితే.. మంచి అలవాట్లు శరీరాన్నే కాదు.. బ్రెయిన్ వయసుని కూడా తగ్గిస్తాయని ఈ మధ్య చేసిన ఒక స్టడీలో తేలింది. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు ఎన్నో లాభాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే..
మెదడు వయసును తగ్గించడం సాధ్యమేనా? అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్ట్‌లు. అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ కేంద్రంగా ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగింది. అందులో బ్రెయిన్ ఏజ్‌ని జెనెటిక్స్ మాత్రమే కాకుండా మన డైలీ రొటీన్స్, స్ట్రెస్ లెవెల్స్ కూడా ప్రభావితం చేస్తాయని తెలిసింది. అంటే స్ట్రెస్‌ని కంట్రోల్‌లో ఉంచుకుని, డైలీ లైఫ్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే అవి మెదడు వయసు తగ్గిస్తాయని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.
128 మందిపై..
ఫ్లోరిడా యూనివర్సిటీ రీసెర్చ్ టీం నాలుగు ఖండాలకు చెందిన 128 మంది మధ్య వయస్కులు, వృద్ధులపై దాదాపు రెండు సంవత్సరాలపాటు పరిశోధనలు చేసింది. ఇందులో పాల్గొన్నవారిలో దాదాపు 70 శాతం మంది మహిళలే. వాళ్లలో చాలామంది దీర్ఘకాలిక మస్క్యులోస్కెలిటల్ పెయిన్, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ స్టడీ రిజల్ట్స్ ఆరోగ్యవంతులకు కూడా వర్తిస్తాయంటున్నారు. రీసెర్చర్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లను మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా విశ్లేషించి ‘‘మెదడు వయసు’’ని అంచనా వేశారు. దాన్ని వాళ్ల వాస్తవ వయసుతో పోల్చారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని ‘బ్రెయిన్ ఏజ్ గ్యాప్’ అంటారు. దాని ఆధారంగా మెదడు ఆరోగ్యాన్ని కూడా అంచనా వేశారు. మెదడు వయసు ఎంత తక్కువగా ఉంటే దాని పనితీరు అంత మెరుగ్గా ఉంటుంది.
అలవాట్లే మూలం!
ఈ రీసెర్చ్‌లో ఆరోగ్యకరమైన లైఫ్‌స్టయిల్ పాటించినవారి బ్రెయిన్ వాళ్ల వాస్తవ వయసు కంటే యవ్వనంగా ఉంది. కొందరి బ్రెయిన్ ఏజ్ గ్యాప్ గరిష్టంగా 8 సంవత్సరాల వరకు ఉన్నట్టు సైంటిస్ట్‌లు తేల్చారు. కేవలం రెండేండ్లలో మెదడు వయసు తగ్గింది. మిగతావాళ్ల వయసు వాళ్ల వాస్తవ వయసుతో సమానంగా ఉంది. అంతేకాదు.. దీర్ఘకాలిక నొప్పి, తక్కువ ఆదాయం, సామాజిక ఇబ్బందులు, సరైన చదువు లేకపోవడం లాంటివి మెదడు వయసుని పెంచుతాయని ఈ స్టడీలో తేలింది. కానీ.. తగినంత గాఢ నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవడం, హెల్దీ బాడీ వెయిట్, పొగాకుకు దూరంగా ఉండడం.. లాంటి మంచి అలవాట్లు ఎలాంటివాళ్ల మెదడు వయసునైనా తగ్గించగలిగాయి.
శరీర బరువు
హెల్దీ వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా మెదడు వయసుని తగ్గిస్తుంది. అధిక బరువు మెదడు రక్తనాళాలను దెబ్బతీసి, వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ ద్వారా మజిల్ మాస్ పెంచుకుని బ్రెయిన్ హెల్త్‌ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల అల్జీమర్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది. బరువు తగ్గడంలో మెటబాలిక్ హెల్త్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది బాగుంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. దీనివల్ల కూడా మెదడు ఆరోగ్యంగా మారుతుంది.
పొగాకుకు దూరంగా..
ధూమపానం మెదడుని దెబ్బతీసి, ఏజింగ్ ప్రాసెస్‌ని వేగవంతం చేస్తుంది. కాబట్టి టొబాకో ఉత్పత్తులకు దూరంగా ఉండడం వల్ల కూడా బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పొగ తాగడం మానేస్తే.. కాగ్నిటివ్ పనితీరు అంటే.. ఆలోచన, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కారం, భాష, అవగాహన లాంటి మెదడు ప్రక్రియలు మెరుగవుతాయి.
►ALSO READ | మొఘల్ వంశంలో తిరుగులేని చక్రవర్తి... షాజహాన్ రాజకీయ మేధాశక్తి, సైనిక నైపుణ్యాలు ఇవే..!
సామాజిక బంధాలు మెరుగుపడాలంటే ప్రతిరోజూ స్నేహితులు, కుటుంబంతో కొంత సమయం గడపాలి. పేరెంట్‌హుడ్ లాంటి సంబంధాలు మెదడు ఫంక్షనల్ కనెక్టివిటీని కాపాడి, ఏజింగ్ ప్రాసెస్ మందగించేలా చేస్తాయి. ఇంటర్ జెనరేషనల్ రిలేషన్‌షిప్స్ ఆక్సిటోసిన్, డోపమైన్‌ని విడుదల చేసి మెదడు యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తాయి. అంతేకాదు.. బలమైన సోషల్ కనెక్షన్లు మెంటల్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. సపోర్టివ్ రిలేషన్‌షిప్స్ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. 2021లో ‘ఏజింగ్ అండ్ సొసైటీ’ చేసిన ఒక స్టడీలో ఎక్కువ సోషల్ రిలేషన్స్ ఉన్నవాళ్లు నాలెడ్జ్ టెస్ట్‌లో ఎక్కువ స్కోర్ చేశారని తేలింది.
బ్రెయిన్ ఏజ్ తగ్గితే లాభమేంటి?
మెదడు వయసు పెరిగితే డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలు తొందరగా వస్తాయి. యంగ్ బ్రెయిన్స్ ఉన్నవాళ్లు ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లాంటివాటిల్లో యాక్టివ్‌గా ఉంటారు. అల్జీమర్స్ రిస్క్ 60 శాతం తగ్గుతుంది. యంగ్ బ్రెయిన్ ఒత్తిడి హార్మోన్లను బాగా కంట్రోల్ చేస్తుంది. దాంతో డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. పెద్దవాళ్లలో బ్రూడింగ్ (అతిగా ఆలోచించడం) తగ్గుతుంది. మెదడు వయసు తగ్గితే వృద్ధాప్యంలో కూడా స్వతంత్రంగా జీవించవచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన మెదడు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
