ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9 అంతస్తుల భవనంపై నుంచి దూకిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫోన్లో గేమ్స్ ఆడటం ఎక్కువైందని తండ్రి మందలించిన దానికే ముగ్గురూ కట్టగట్టుకుని దూకేయడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కొరియన్ గేమ్ కు బానిసలైన కూతుళ్లను తండ్రి మందలించడంతో ఈ ఘటన జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. బుధవారం (ఫిబ్రవరి 04) మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
పాకెట్ డైరీలో 8 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయారు ముగ్గురు అక్కా చెల్లెళ్లు. డైరీలో ఉన్నది మొత్తం చదవండి.. ఎందుకంటే అది మొత్తం నిజం.. నిజంగా క్షమించండి నాన్నా.. సారీ పాపా అంటూ నోట్ రాసి చనిపోయారు ఈ మైనర్లు. కొరియన్ టాస్క్-బేస్డ్ గేమ్ కు బానిసలై ముగ్గురు బాలికలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ట్విస్ట్ ఏంటి..?
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అరుణ్ సింగ్ వెల్లడించిన నిజం షాకింగ్ కు గురిచేసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించినట్లు అరుణ్ చెప్పాడు. 9వ అంతస్తు బాల్కనీ నుంచి ఒక అమ్మాయి దూకేందుకు ప్రయత్నించగా.. మిగతా ఇద్దరు ఆమెను వెనకకు లాగేందుకు ప్రయత్నించారు. కాపాడే ప్రయత్నంలో వాళ్లు కూడా పడిపోయారు. దీంతో చూస్తుండగానే ముగ్గురూ కింద పడి చనిపోయారని అరుణ్ తెలిపాడు. వద్దని ఎంత వారించినా వినలేకపోయారని తెలిపాడు.
ముగ్గురూ జంపింగ్ చేయడం చూశాను.. ముగ్గురిలో ఒకరు దూకేందుకు ప్రయత్నించగా.. మిగతా ఇద్దరు ఆపే ప్రయత్నం చేశారు. రేలింగ్ మీద కూర్చుని ఉన్న అందరిలో ఒకరు దూకుతుంటే మిగతా వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ముగ్గురూ బాల్కనీ నుంచి అలాగే పడిపోయార.. అంటూ విషాద గాత్రంతో చెప్పాడు అరుణ్. వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేసినట్లు చెప్పాడు.
#WATCH | Ghaziabad, UP: An eyewitness, Arun Kumar, says, "I saw all three of them jumping... It happened at around 2 AM... From what I saw, one of them planned to jump, and the others fell while trying to save her. I called the police... " https://t.co/9RG9CbTFbH pic.twitter.com/c9gTl1WpmV
— ANI (@ANI) February 4, 2026
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తిండి, నిద్ర, చదువు మానేసి అదే పనిగా గేమ్ ఆడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నారు. మమ్మీ.. డాడీ క్షమించండి అని సూసైడ్ లెటర్ రాసి 9 అంతస్తుల భవనం పై నుంచి దూకి ముగ్గురు ఒకేసారి చనిపోయారు. మృతులను నిషిక (16), ప్రాచి (14), పాఖి (12)గా గుర్తించారు పోలీసులు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు.
ఆన్ లైన్ గేమ్‌కు బానిసలయ్యే ముగ్గురు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు.. ముగ్గురు కూతుర్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో బాలికల తండ్రి చేతన్ కుమార్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. నా ఇంటి మహారాణులు నన్ను వదిలి వెళ్లిపోయారంటూ గుండెలవిసేలా రోదించాడు. నా ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని అనుకోలేదు.. వాళ్లు మొబైల్ ఫోన్లో లూడో గేమ్ ఆడుకుంటున్నారని అనుకున్నాను.. అది వాళ్లకు డెత్ గేమ్ అవుతుందని అనుకోలేదంటూ గుండెలు బాదుకున్నాడు.
ఇది ఒక టాస్క్ గేమ్ అని.. ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదని కన్నీ్ళ్లు పెట్టుకున్నాడు. వాళ్లు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుకునే వాళ్లు.. అది టాస్క్ గేమ్ అని.. డెత్ గేమ్ అని పోలీసులు చెప్పే వరకు నాకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. నా ముగ్గురు పిల్లలు 9వ అంతస్తు నుంచి దూకి చనిపోవటానికి.. నిచ్చెన వాడారంటూ కన్నీటితో చెప్పాడు ఆ తండ్రి. ఆన్ లైన్ గేమ్‌కు బానిసై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
