ICC T20 Rankings: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్.. ఒక్క సిరీస్‌తో 32 మందిని వెనక్కి నెట్టిన కిషాన్

ICC T20 Rankings: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్.. ఒక్క సిరీస్‌తో 32 మందిని వెనక్కి నెట్టిన కిషాన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 4) రిలీజ్ చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో 32 స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ముందు 64వ స్థానంలో ఉన్న ఈ జార్ఖండ్ వీరుడు ఏకంగా 32 స్థానాలు ఎగబాకడం విశేషం. కిషాన్ రెండేళ్ల తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి దుమ్ములేపాడు.

ALSO READ : బాయ్‌‌‌‌కాట్‌‌‌‌కు భారీ మూల్యం తప్పదు

న్యూజిలాండ్ పై వీర ఉతుకుడు:
   
తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ లో 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్సర్లున్నాయి.

ALSO READ : లాయర్‎ అవతారమెత్తిన సీఎం మమతా.. 

అగ్ర స్థానంలోనే అభిషేక్: 

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానలోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బట్లర్, సాల్ట్ వరుసగా రెండు మూడు ర్యాంక్ లో నిలిచారు. ఇండియన్ ప్లేయర్ల విషయానికి వస్తే తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 3వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన సూర్య ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. శివమ్ దూబే 17 స్థానాలు ముందుకు జరిగిన 41 వ స్థానంలో నిలవడం విశేషం. 

ALSO READ : రాముడిగా మహేష్.. రెండు నిమిషాల సీన్‌కు ఆరు నెలల ట్రైనింగ్..

రికెల్ టన్ 42 స్థానాలు ముందుకు  

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్ 16 స్థానాలు ఏకబాకి 14 వ స్థానంలో నిలిచాడు. సఫారీ ప్లేయర్స్ డికాక్, రికెల్ టన్ తమ ప్రదర్శనతో దూసుకొచ్చారు. డికాక్ 15 స్థానాలు ఎగబాకి 22 వ ర్యాంక్ కు చేరుకున్నాడు. మరోవైపు రికెల్ టన్ ఏకంగా 42 స్థానాలు ఎగబాకి 40 ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇండియాతో జరిగిన చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 13 స్థానాలు ఎగబాకి 32 వ స్థానంలో నిలిచాడు.