సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’(VARANASI). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, ఇప్పుడు అంతకంటే రెట్టింపు అంచనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న రుద్రుడిగా కనిపించబోతున్నారు. పొడవాటి జుట్టు మరియు గుబురు గడ్డం పెంచడంతో పాటు శారీరకంగా కొన్ని కిలోల బరువు పెరిగి గంభీరంగా కనిపిస్తున్నారు.
ALSO READ : చిరు మామకు సపోర్టుగా లావణ్య త్రిపాఠి..
లేటెస్ట్గా.. మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ పంచుకున్న విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో లార్డ్ రామ్ పాత్రను తెరపై నమ్మకంగా ప్రతిబింబించేందుకు తన శరీరాకృతి, హావభావాలు, కదలికలు, అలాగే పరుగెత్తే విధానంలోనూ ప్రత్యేక మార్పులు చేసుకున్నట్లు మహేష్ తెలిపారు. ఈ పరివర్తన కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే పరిమితం కాకుండా, నెలల తరబడి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
ALSO READ : రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ కమెడియన్ మృతి
“లార్డ్ రామ్ పాత్రను పోషించాలంటే ఖచ్చితత్వం ఎంతో అవసరమని రాజమౌళి మొదటి రోజు నుంచే స్పష్టంగా చెప్పారు” అని మహేష్ తెలిపారు. రాముడు అంటేనే హుందాతనం.. ఈ క్రమంలోనే రాముడి లక్షణాలు, నడక, శరీర భాష ఎలా ఉండాలో చూపించారు. అలాగే, ప్రతి అంశంలోనూ రాముడి ధైర్యం, నిగ్రహం, దైవత్వం ప్రతిబింబించాల్సిందేనని ఆయన వివరించారు. పాత్రల శారీరక భాషపై రాజమౌళి ఎంత శ్రద్ధ పెడతారో.. ఈ మహోత్తరమైన నా పాత్ర ద్వారా మరింత స్పష్టమైందని మహేష్ పేర్కొన్నారు.
On experiencing #VARANASI to the World… pic.twitter.com/368Hr4AvZ7
— Varanasi (@VaranasiMovie) February 3, 2026
అలాగే, మహేష్ మరిన్ని విషయాలు చెబుతూ.. “2024 నుంచే ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన మా మా యుద్ధం మొదలైంది. ఈ సినిమాలో నేను రాముడి పాత్రను పోషిస్తున్నాను. నా లుక్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం. అందులో భాగంగా 2025లో జర్మనీకి కూడా వెళ్లి విస్తృతంగా పరిశోధనలు చేశాం. ఎందుకంటే రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణంగా పరిశీలిస్తారు. అవసరమైతే ఎన్నిసార్లైనా రిహార్సల్స్ చేయిస్తారు.రాముడు అంటేనే హుందాతనం. ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది. నిలబడే విధానం దగ్గర నుంచి పాత్రలో నటించే తీరు వరకూ ఎన్నో రిహార్సల్స్ చేశాం. దాని కోసం రెండు మూడు నెలలు నిరంతరం కష్టపడ్డాను.
ALSO READ : స్ట్రాప్‌లెన్ డ్రెస్‌లో శ్రీలీల మెరుపులు..
అంతేకాదు, రాజమౌళి నేను పరుగెత్తే విధానాన్ని కూడా పూర్తిగా మార్చారు. దానికోసం దాదాపు ఆరు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. సినిమాలో కేవలం రెండు షాట్ల కోసం ఇంత కృషి చేశాం. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ధ, అంకితభావం ఎంతటిదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ పాత్ర కోసం ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు యూరోపియన్ శిల్పాలను కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశాం.”అని మహేష్ వెల్లడించారు.
ALSO READ : ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా
‘కళరిపయట్టు’లో మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ
‘వారణాసి’ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్ర అయిన రుద్రుడిగా కనిపించేందుకు మహేష్ బాబు ప్రాచీన యుద్ధకళ అయిన కళరిపయట్టులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల మహేష్ ట్రైనర్ హరిక్రిష్ కాకాని కూడా వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు హరిక్రిష్ కాకాని, ‘వారణాసి’ సినిమా కోసం మహేష్ బాబుకు ప్రత్యేకంగా ఈ శిక్షణ అందించారు.
గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశం కోసం మహేష్‌కు కళరిపయట్టు ట్రైనింగ్ అవసరమైందని ఆయన తెలిపారు.ఆ సన్నివేశాన్ని పూర్తిగా సహజంగా, ప్రామాణికంగా చూపించాలనే ఉద్దేశంతో, కేరళ రాష్ట్రంలో పుట్టిన ప్రాచీన యుద్ధకళ అయిన కళరిపయట్టును మహేష్ కఠినంగా అభ్యసించినట్లు హరిక్రిష్ పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా మహేష్ పాత్రకు అవసరమైన శారీరక దృఢత్వం, సమతుల్యత, హావభావాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు.
మహేష్ బాబుకు ప్రాచీన మార్షల్ ఆర్ట్స్ రూపంలో శిక్షణ ఇవ్వడం తనకు గర్వకారణమని, ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నానని హరిక్రిష్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో అనుభవం ఉన్న మహేష్, ఇప్పుడు కళరిపయట్టు కూడా నేర్చుకోవడం విశేషంగా మారింది. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
