టాలీవుడ్ 'డాన్సింగ్ క్వీన్' శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ ఇండస్ట్రీలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. అటు తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇటు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో కెరీర్‌లో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'డ్రామా'టిక్ లుక్‌తో మెరుపులు..
లేటెస్ట్ గా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్ల కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. చెక్ ప్యాట్రన్‌తో రూపొందించిన స్ట్రాప్‌లెన్ డ్రెస్ ధరించి ఆమె ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించిందీ బ్యూటీ. నడుము చుట్టూ విస్తరించే డ్రామాటిక్ డిజైన్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ ఫొటోకు ఆమె "కొంచెం డ్రామా టిప్" అంటూ క్యాప్షన్ ఇచ్చి తన క్రియేటివ్ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. నిమిషాల్లోనే ఈ పోస్ట్ వేలల్లో లైకులు, కామెంట్లతో వైరల్‌గా మారింది.
Also Read : తొలిసారి దిల్ రాజ్ నిర్మాణంలో బాలయ్య
ధనుష్ సినిమాలో ఛాన్స్..
శ్రీలీల కెరీర్‌లో మరో బిగ్ బ్రేక్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ధనుష్ 55వ చిత్రంగా తెరకెక్కుతున్న 'D55' లో శ్రీలీల నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రాజకుమార్ పెరియసామి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రేసులో మొదట సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి ఆ లక్కీ ఛాన్స్ శ్రీలీలనే వరించింది. ఈ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఫొటోల్లో శ్రీలీల పాస్టల్ రంగు సూట్‌లో ఎంతో హుందాగా కనిపించారు. ధనుష్, సినిమా యూనిట్ ఆమెకు పూల బొకే ఇచ్చి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. ధనుష్ పక్కన శ్రీలీల కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇప్పుడే చర్చలు మొదలుపెట్టారు.
అటు టాలీవుడ్.. ఇటు బాలీవుడ్!
కేవలం సౌత్ సినిమాలే కాదు, శ్రీలీల బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో కూడా రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గ్లామర్, యాక్టింగ్ , డాన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
