Lavanya Tripathi: చిరు మామకు సపోర్టుగా లావణ్య త్రిపాఠి.. ట్రోల్స్‌కు మెగా కోడలు స్ట్రాంగ్ రిప్లై!

Lavanya Tripathi: చిరు మామకు సపోర్టుగా లావణ్య త్రిపాఠి.. ట్రోల్స్‌కు మెగా కోడలు స్ట్రాంగ్ రిప్లై!

మెగాస్టార్ చిరంజీవి ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు కెరీర్ పరంగా 'మన శంకరవరప్రసాద్' మూవీతో 2026 సంక్రాంతికి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనివ్వడంతో చిరు నివాసం సందడిగా మారింది . అటు అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే, ఈ సంతోష సమయంలోనే పాత వివాదాలు మరోసారి తెరపైకి వచ్చి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.

 వివాదానికి కారణం!

గత ఏడాది (ఫిబ్రవరి 2025) ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలర్లకు ఆయుధంగా మారాయి. తన ఇంట్లో నలుగురు మనవరాళ్లు ఉండటంతో తాను "లేడీస్ హాస్టల్ వార్డెన్"లా ఫీలవుతున్నానని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.  రామ్ చరణ్‌కు వారసుడు (అబ్బాయి) పుడితే తమ వంశం ముందుకు సాగుతుందని, కానీ చరణ్‌కు తన కూతురు క్లిన్ కారా అంటేనే ప్రాణమని చెప్పుకొచ్చారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందేమోనని భయంగా ఉంది అంటూ అప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్!

లేటెస్ట్ గా చరణ్‌కు కవలలు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక జర్నలిస్ట్ చిరు పాత వ్యాఖ్యలను ఉటంకిస్తూ 'మెగా వారసుడు వచ్చేశాడు' అనే అర్థంలో సెటైర్లు వేశారు. దీనిపై మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. నేను సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ మీ నుంచి ఇలాంటిది ఊహించలేదు. ఒక అద్భుతమైన క్షణాన్ని ఇంత అసహ్యంగా మార్చడం చాలా నీచమైన విషయం. మా పెద మామగారు ఇంట్లోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంత గౌరవంగా, ప్రేమగా చూస్తారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో 1 శాతం కూడా ఇతర పురుషులు చేయలేరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడకపోవడమే మంచిది అంటూ ఎక్స్‌లో  గట్టి కౌంటర్ ఇచ్చారు.

ప్రశంసలు.. విమర్శలు

లావణ్య తన మామగారికి అండగా నిలవడాన్ని మెగా అభిమానులు కొనియాడుతుండగా, ఆమె వాడిన భాషపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది 2026, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. ఫ్యూడల్ వ్యవస్థలో కాదు. మీ కుటుంబాన్ని గొప్పగా చెప్పుకోవడానికి మిగిలిన పురుషులను తక్కువ చేయడం ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. లోకంలోని మగవారందరూ ఏం చేస్తారో నీకు తెలుసా? 1 శాతం కూడా చేయలేరని ఎలా అంటావు? అంటూ ఆమె ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

►ALSO READ | Jabardasth Comedian: రోడ్డు ప్రమాదంలో ‘జబర్దస్త్’ కమెడియన్ మృతి : కన్నీళ్లు పెట్టుకున్న సుమ

నిజానికి, లావణ్య-వరుణ్ తేజ్‌లకు గతేడాది బాబు పుట్టినప్పుడు చిరంజీవి ఎంతో భావోద్వేగంతో స్పందించారు. కొణిదెల కుటుంబంలోకి చిన్నారికి ఆహ్వానం పలుకుతూ, తన సోదరుడు నాగబాబు దంపతులు తాతామామ్మలుగా ప్రమోట్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో వారసత్వం అంటే కేవలం పేరు మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల పట్ల ఆయన చూపించే అపారమైన అనురాగం అని సన్నిహితులు చెబుతుంటారు.