న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం (ఫిబ్రవరి 4) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారమెత్తారు. ఓ కేసు విచారణలో భాగంగా నల్లకోర్టు ధరించి స్వయంగా ఆమె సుప్రీంకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. తద్వారా దేశంలోనే తొలిసారి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు.
అసలు కేసు ఏంటంటే..?
వెస్ట్ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్లో సర్‌ను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై బుధవారం (ఫిబ్రవరి 4) విచారణ జరిగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ స్వయంగా కోర్టు హాజరై వాదనలు వినిపించారు. బెంగాల్లో సర్ ప్రక్రియను తప్పుగా వర్తింపజేస్తున్నారని.. ఓటర్లలో భయాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత లోపించిందన్నారు.
ALSO READ : మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి..
సర్ ప్రక్రియ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి ఆయుధంగా ఉపయోగించబడుతోందని.. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సర్ పేరుతో ఈసీ దొంగ ఓట్లు తొలగించడం కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను నమోదు చేస్తోందని ఆరోపించారు. టీఎంసీకి బలమున్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు తాను ఆరు లేఖలు రాసినప్పటికీ.. వాటిలో ఏ ఒక్కదానికీ స్పందన రాలేదని తెలిపారు. సర్ వ్యాయామంతో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. ఇది ప్రజాస్వామ్య న్యాయానికి ముప్పు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య తన పార్టీకి లేదా తన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదని.. ఇది దేశ ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం జరుగుతున్న యుద్ధమని కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోందని హాట్ కామెంట్ చేశారు.
ALSO READ : అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్
బెంగాల్ లో న్యాయపరమైన జోక్యం అవసరమని మమతా బెనర్జీ కోర్టును అభ్యర్థించారు. మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బెంగాల్ లో సర్ వ్యాయమానికి సంబంధించి ఈసీ నుంచి వివరణాత్మక స్పందన కోరింది. అనంతరం కేసు విచారణను 2026, ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ స్వయంగా నల్లకోటు ధరించి సుప్రీంకోర్టుకు హాజరై వాదనలు వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
న్యాయశాస్త్రంలో మమతా బెనర్జీకి పట్టా:
కోల్‌కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో మమతా బెనర్జీ పట్టా పొందారు. ఆమెకు న్యాయవాదిగా వాదించే అర్హత ఉంది. ఈ క్రమంలోనే తన కేసును స్వయంగా వాదించుకునేందుకు ఆమె సుప్రీంకోర్టు అనుమతి కోరారు. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం స్వయంగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ : చిరు మామకు సపోర్టుగా లావణ్య త్రిపాఠి..
Mamata Banerjee walks across the Court room thanking advocates and speaking with lawyers from other side including Rakesh Dwivedi. @MamataOfficial #MamataBanerjee pic.twitter.com/HfWH7asgpb
— Bar and Bench (@barandbench) February 4, 2026
