మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి.. ఓట్లు దండుకునే కుట్ర : టీపీసీసీ మహేశ్ గౌడ్

మతం పేరుతో విద్వేషాలు  రెచ్చగొట్టి.. ఓట్లు దండుకునే కుట్ర : టీపీసీసీ మహేశ్ గౌడ్

బీజేపీ విమర్శలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతీ బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం  చూపు చూస్తోందని  విమర్శించారు.మిత్రపక్షాలకే నిధులు కేటాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతున్నారని .. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.బీజేపీ రెచ్చగొట్టే విధానాలకు తెలంగాణ ప్రజలు లొంగరని అన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్స్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని సెటైర్ వేశారు  మహేశ్ గౌడ్.  స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెగ్మెంట్లో డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం చేసిన చట్టాలను బీజేపీ సర్కార్ తొక్కిపెట్టిందన్నారు. బీసీ అనుకూల చట్టాలను కేంద్రం ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు.

ఉపాధి హామీ నిధులకు మోదీ సర్కార్ కోత పెట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత  లేదన్నారు. దేవుళ్ల పేరుతో బీజేపీ లీడర్లు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. విద్వేశాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమే బీజేపీ ప్లాన్..అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ అజెండా అని చెప్పారు. కాంగ్రెస్ ప్రశ్నలకు బీజేపీ చీఫ్ నబీన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.