బాయ్‌‌‌‌కాట్‌‌‌‌కు భారీ మూల్యం తప్పదు: పాక్‌‌‌‌కు ఐసీసీ వార్నింగ్

బాయ్‌‌‌‌కాట్‌‌‌‌కు భారీ మూల్యం తప్పదు: పాక్‌‌‌‌కు ఐసీసీ వార్నింగ్

కరాచీ/ న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‎లో టీమిండియాతో మ్యాచ్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్ చేయాలని నిర్ణయించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మొండి నిర్ణయం వల్ల పాక్ క్రికెట్ బోర్డు చట్టపరమైన చిక్కులతో పాటు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసిందని పీసీబీ వర్గాలు మంగళవారం తెలిపాయి. టోర్నీ అధికారిక బ్రాడ్‌‌‌‌కాస్టర్ జియో హాట్‌‌‌‌-స్టార్ ఇండియా–-పాక్ మ్యాచ్ రద్దు వల్ల కలిగే భారీ నష్టానికి (సుమారు రూ. 200– 250 కోట్లు) పరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

పాక్ తన నిర్ణయం మార్చుకోకపోతే, ఐసీసీ నుంచి ఆ దేశానికి అందాల్సిన సుమారు 35 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 300 కోట్లు) వార్షిక ఆదాయ వాటాను నిలిపివేసి, ఆ మొత్తాన్ని బ్రాడ్‌‌‌‌కాస్టర్లకు చెల్లించే ఆలోచనలో ఐసీసీ ఉంది. కాగా, ఈ నెల 12న బంగ్లాదేశ్‌‌‌‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత, పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.