ఒక్కరోజే కేజీకి రూ.40వేలు పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..?

ఒక్కరోజే కేజీకి రూ.40వేలు పెరిగిన వెండి.. గోల్డ్ ఎంత పెరిగిందంటే..?

అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలతో పాటు, అమెరికా ఇండియా డీల్ వంటి శుభపరిణామాలు ఆర్థిక అస్థిరతను మెల్లగా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా భారీ పతనాన్ని చూసిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లను అందిపుచ్చుకునేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు, షాపర్లు ప్రయత్నిస్తున్న వేళ మళ్లీ రేట్లు పెరుగుతూ ర్యాలీని తిరిగి స్టార్ట్ చేశాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా ఇవాళ పెరిగిన రేట్లను గమనించండి. 

ఫిబ్రవరి 4న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.660 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16వేల 053గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 715గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

ALSO READ : భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఇక వెండి రేట్లు వరుస పతనం నుంచి తిరిగి పుంజుకుని దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. కానీ బుధవారం ఫిబ్రవరి 4, 2025న వెండి రేటు కేజీకి రూ.40వేలు పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.40వేలు పెరిగి రూ.3లక్షల 20వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.320 వద్ద ఉంది.