జ్యోతిష్యం: కుంభరాశిలో రాహువు.. శుక్రుడు కలయిక.. ఐదు రాశుల వారికి కనకవర్షమే.. మిగతా వారికి జరిగేది ఇదే..!

జ్యోతిష్యం:  కుంభరాశిలో రాహువు.. శుక్రుడు కలయిక.. ఐదు రాశుల వారికి కనకవర్షమే..  మిగతా వారికి జరిగేది ఇదే..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ప్రతి వ్యక్తి జీవితంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని నమ్మకం. ముఖ్యంగా శుభగ్రహాల కలయికలు ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు.  ఫిబ్రవరి 6 వ తేదీన అదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు,  కుంభంలో  వీరిద్దరి కలయిక ఐదురాశుల (  మేషం, మిధునం, సింహం, తుల , కుంభం) వారిజాతకం మారబోతుంది.  ఆ రాశులతో మిగతా వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .. . 

మేష రాశి:  కుంభరాశిలో శుక్రుడు.. రాహువు కలిసి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి  అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.  ఉద్యోగ‌స్తుల‌కు ఆర్థికంగా  క‌ల‌సి వ‌స్తుంది.ఆదాయం పెరుగుతుంది.  విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగ‌స్తుల‌కు వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంటుంది.  మొండి బ‌కాయిలు వ‌సూల‌వుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలసి వస్తుంది.  గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెడితే ఆర్థిక లాభాలు కలసి వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకొనే నిర్ణయం  లైఫ్​టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

వృషభరాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  అనుకున్న పనులు కొంచెం నిదానంగా పూర్తవుతాయి.  ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఖర్చులు పెరుగుతాయి.  కెరీర్​ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్లు వస్తాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు కష్ట పడాల్సి ఉంటుంది.   కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి.  తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

మిథున రాశి:   ఈ రాశి వారికి  ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.  గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార‌స్తులు కొత్త‌గా పెట్టుబ‌డులు పెడ‌తారు.  విదేశాల‌లో ఉద్యోగం చేసే వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప‌ని ఒత్తిడి.. శ్రమ అధికం అవుతుంది.  కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ప‌రిష్కార‌మ‌వ‌వుతాయి.  తండ్రి వైపు నుంచి ఆస్తి ల‌భిస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్ రావ‌డంతో పాటు వేత‌నం పెరుగుతుంది. 

కర్కాటకరాశి :  ఈ రాశి  వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు అప్రమ‌త్తంగా ఉండాలి.  త‌గిన జాగ్రత్తలు తీసుకోక‌పోతే పెట్టుబ‌డి పెట్టిన సొమ్ము న‌ష్టపోయే అవ‌కాశం ఉంది.  ఉద్యోగ‌స్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్యత‌లు తీసుకొనే అవ‌కాశం క‌ల‌దు.  ఆదాయం పెరుగుతుంది.  ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది.  వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేవిష‌యాన్ని వాయిదా మంచిది. .ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రేమ విష‌యాలు కూడా వాయిదా వేయడం  వేసుకోవ‌డం  మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు. 

సింహ రాశి :  రాహువు.. శుక్రుడు కలిసి ఒకే రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి  ఎంతో అనుకూలంగా ఉండనుంది.  ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది.  వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది.  గతంలో ఆగిపోయిన పనులను తిరిగి చేపడతారు.ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి.  ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్ తో వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంది.  కేరీర్ లో ఉన్నత‌స్థానాన్ని పొందుతారు.  ఇప్పటి వ‌ర‌కు మిమ్మల‌ను వ్యతిరేకించిన వారే మీ స‌హాయాన్ని అర్దిస్తారు.  ఆక‌స్మికంగా ధ‌న‌లాభం పొందుతారు. ప్రేమ‌.. పెళ్లి మొద‌ల‌గు అంశాలు క‌ల‌సి వ‌స్తాయి. 

కన్య రాశి : ఈ రాశి వారికి ప్రతి విషయం ఛాలెంజ్‌గా ఉంటుంది.  వ్యాపారం కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులు అనవరంగా మాట పడతారు.  అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివాదాలు ఏర్పడుతాయి.  ఆస్తుల మ‌ధ్య వివాదాలు వ‌స్తాయి.   ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు. స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. 

తుల రాశి  : శుక్రుడు... రాహువు... కుంభరాశిలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి  సానుకూల శక్తిని పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది.  వీరు తల పెట్టిన పనులు  సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.   సంతానం కోసం ఎదురు చూసే వారు శుభ‌వార్త వింటారు.  వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి.  కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేందుకు  చాలా అనుకూలంగా ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి అనుకోకుండా ఆర్డర్లు వ‌స్తాయి. కొత్తగా ఇల్లు క‌ట్టేందుకు అంకురార్పణ చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తులకు ప‌నిభారం అధిక‌మ‌వుతుంది.  స‌హోద్యోగ‌ల అండ‌దండ‌లు ఉంటాయి.  మీ బాస్ మీకు కొన్ని కీల‌క‌మైన ప‌నులు అప్పగించే అవ‌కాశం ఉంటుంది.  ఇది మీ లైఫ్ న‌కు ట‌ర్నింగ్ పాయింట్ కూడా అవ్వవ‌చ్చు. కాబ‌ట్టి అద‌న‌పు బాధ్యత‌ల‌ను ఇష్టంగా స్వీక‌రించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృశ్చికరాశి :   ఈ రాశి వారికి కెరీర్  విషయంలో  మంచి మార్పులు క‌లుగుతాయి.  ఉద్యోగ‌స్తుల‌కు.. వ్యాపార‌స్తుల‌కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యక్తిగ‌త జీవితంలో ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు  తీసుకోవద్దు. పెండింగ్ ప‌నులు అతిక‌ష్టంమీద పూర్తి చేయ‌గ‌లుగుతారు.  ఉద్యోగ‌స్తులు ఎవ‌రితోనూ ఎలాంటి వాద‌న‌లు పెట్టుకోవ‌ద్దని పండితులు సూచిస్తున్నారు.  వ్యాపార‌స్తులకు మిశ్రమ ఫ‌లితాలుంటాయి.  స‌మాజంలో కీర్తి గౌరవం పొందుతారు. 

ధనుస్సురాశి : కుంభ రాశిలో రాహువు.. శుక్రుడు కలిసి సంచరించడం వలన ఈ రాశి వారికి కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు.  ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి.  ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు..

మకరరాశి :  ఈ రాశి వారు  కొత్త సవాళ్లను  ఎదుర్కోవలసి ఉంటుంది.   ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు..  నిదానంగా పరిస్థితులు అనుకూలంగా  మారతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి. విదేశీ ప్రయాణం.. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  నిదానంగా ప్రతికూలత ప్రభావం తగ్గడంతో ..కొంత ఉపశమనం కలుగుతుంది.

కుంభ రాశి  : ఈ రాశి వారికి శుక్రుడు స్వరాశిలోకి రావడం వల్ల ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగ పరంగా పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి ఇది అనుకూల సమయం. ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. ప్రతి ప్రయత్నంలో విజయావకాశాలు పెరుగుతాయి.జీవిత‌భాగ‌స్వామికోసం స‌మ‌యాన్ని కేటాయిస్తారు. ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది.  కొన్ని కొత్త కార్యక్రమాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆనందంతో పాటు సంప‌ద పెరుగుతుంది.  పెండింగ్ ప‌నులు పూర్తికావ‌డంతో కొంత ఊర‌ట క‌లుగుతుంది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఆరోగ్య స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. 

మీనరాశి:  ఈ రాశి రాశి వారికి  ఆర్థిక పరంగా స‌మ‌స్యలు ఏర్పడుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అన‌వ‌స‌రంగా ఖ‌ర్చులు పెరుగుతాయి.  కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి.  ఆర్థిక విష‌యాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివాదాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.  మీలో మీరే కూర్చుని ప‌రిష్కరించుకోండి.. మూడో వ్యక్తి ద‌గ్గర‌కు ప‌రిష్కారం కోసం వెళ్లవ‌ద్దని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ‌.. పెళ్లి విష‌యాల‌ను వాయిదా వేసుకోండి. ప్రేమికులు ఎలాంటి సంభాష‌ణ‌లు.. మీటింగ్ లు పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఉద్యోగ‌స్తులు ఎక్కువ స‌మ‌యం ప‌నిచేయాల్సి ఉంటుంది.  ప్రతి విషయంలోనూ ఓర్పు .. సహనం పాటించండి.. చివరకు అంతా మంచే జరుగుతుంది.  ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారాన్నా  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.