మంత్రిని కలిసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మంత్రిని కలిసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: రాష్ర్ట కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిని ఆదివారం హైదరాబాద్​లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని సమస్యలు, పెండింగ్​ పనుల​అనుమతులు, అభివృద్ధి పనుల మంజూరుపై మంత్రితో చర్చించారు. అభివృద్ధి పనులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.