కూకట్పల్లిలో అధికారుల నిర్లక్ష్యం..బాలుడికి కరెంట్ షాక్..తీవ్రగాయాలు

కూకట్పల్లిలో అధికారుల నిర్లక్ష్యం..బాలుడికి కరెంట్ షాక్..తీవ్రగాయాలు

అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది. పతంగి ఎగురవేస్తూ ట్రాన్స్​ ఫార్మర్​ సమీపంలోకి వెళ్లి విద్యుత్​ షాక్​ గురై తీవ్రగాయాలపాలయ్యాడు. కూకట్​పల్లి  డివిజన్​ పరిధిలోని జరిగిన ఘటనలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..  

కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ పరిధిలలోని ఆస్బెస్టాస్ కాలనీ లో ఆదివారం (ఫిబ్రవరి8) విషాద ఘటన చోటు చేసుకుంది. బాలుడు పతంగితో ఆడుకుంటుండగా దారం తెగి ట్రాన్స్​ఫార్మర్​ దగ్గర పడడంతో పతంగిని తీసుకోవడానికి వెళ్లిన బాలుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ ట్రాన్స్​ఫార్మర్​ దగ్గర ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని అధికారులు ట్రాన్స్​ఫార్మర్​ చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయకపోవడం వాళ్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఫెన్సింగ్​ ఏర్పాటు  చేయాలని డిమాండ్​ చేశారు.