ఫిబ్రవరి 9న ఉచిత టీబీ వైద్య శిబిరం

ఫిబ్రవరి 9న ఉచిత టీబీ వైద్య శిబిరం

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 9న ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ రణధీర్ ఆదివారం తెలిపారు. వైద్య పరీక్షలకు వచ్చే పేషెంట్లు ఉదయం తెమడ బాటిల్లో పట్టి తీసుకొని రావాలని చెప్పారు. ఎక్సరే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండు వారాలకు మించి తెమడతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రాత్రిపూట జ్వరం వచ్చి చెమటతో తగ్గడం, దగ్గేటప్పుడు బ్లడ్ రావడం, చాతిలో నొప్పి లాంటి లక్షణాలతో పాటు బరువు తక్కువ ఉన్న పిల్లల మెడ, చంకలలో గడ్డలు, షుగర్, హెచ్ఐవీ, ఊపిరితిత్తుల సమస్య, టీబీ చికిత్స పొందిన వారు రావచ్చని చెప్పారు.