మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కల్వకుర్తి.. మన్ను మశానం అంటూ.. పునాది రాళ్లు వేసుకుంటూ పోయారని.. కానీ ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలకు రాలేదని తెలిపారు. ఆ పునాది రాళ్లను కృష్ణా నదిలో అడ్డం వేస్తే చెక్ డ్యాం అయ్యేదని చమత్కరించారు కేసీఆర్. ఆదివారం (డిసెంబర్ 21) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రాబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్.
చంద్రబాబు హయాంలో ప్రతి నియోజకవర్గం నుంచి బొంబాయికి వలసలు వెళ్లే వారని అన్నారు. ప్రతి తాలూకా నుంచి ముంబైకి బస్సు ఉండేదని.. అంతి భయంకరమైన కరువు ఉండేదని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా బేసిన్ లో ఉంటది.. కానీ భయంకరమైన కరువు..పొట్ట చేతబట్టుకుని వలస పోయారు.. పల్లె పల్లెలో పల్లేరు మొలిచే అని కవులు పాటలు రాశారు.. అప్పుడు చంద్రబాబు స్లోగన్.. సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. వలసల చూసీ చాలా బాధపడ్డ. కన్నీళొచ్చి ఏడ్చేవాడిని. చాలా కోపం వచ్చింది. అప్పుడు ప్రథమ మహాసభ మీటింగ్ మహబూబ్ నగర్ లో పెట్టాం.. తీవ్రంగా విమర్శించా. జూరాల ప్రాజెక్టు విషయంలో ముంపు ప్రాంతానికి కర్ణాటకకు 1300 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కట్టాల్సి ఉంది.. మహబూబ్ నగర్ కదా.. కట్టలేదు.
దీంతో తీవ్ర దాడి చేసిన.. దెబ్బకు మోకాళ్ల మీద పరుగెత్తి కట్టిండు.. నా దాడి తట్టుకోలేక.. ఆ తర్వాత చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే RDSను బాంబు పెట్టి పేల్చాడు.. అప్పుడు జోగులాంబ నుండి గద్వాల్ పాదయత్ర చేసి ఈ అన్యాయాన్ని ఎండగట్టాను.. అప్పుడు వెంటనే జూరాల నుండి RDS లింక్ కెనాల్ అని చంద్రబాబు డ్రామా మొదలు పెట్టాడు.. అంటూ చంద్రబాబు మీద ఫైరయ్యారు - కేసీఆర్.
