Sonam Kapoor Baby Bump: ఫ్యాషన్ ఐకాన్ మరోసారి వైరల్.. బేబీ బంప్‌ ఫొటోలతో మెరిసిన సోనమ్ కపూర్

Sonam Kapoor Baby Bump: ఫ్యాషన్ ఐకాన్ మరోసారి వైరల్.. బేబీ బంప్‌ ఫొటోలతో మెరిసిన సోనమ్ కపూర్

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, నటి సోనమ్ కపూర్ త్వరలో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను ఆమె 2025 నవంబర్ 20నే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సోనమ్ బేబీ బంప్‌ ప్రదర్శిస్తున్న కొత్త ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఫ్యాషన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన సోనమ్, ఈ ఫొటోల్లోనూ స్టైలిష్ లుక్స్‌తో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 

లేటెస్ట్గా ఈ ఫోటోలను సోనమ్ సిస్టర్ రియా కపూర్ ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేస్తూ “వర్కింగ్ మదర్” అనే క్యాప్షన్ జోడించింది. ఇందులో ప్రముఖ డిజైనర్ ధ్రువ్ కపూర్ రూపొందించిన తెల్లటి చొక్కా మరియు స్కర్ట్‌ను సోనమ్ ధరించారు. ఈ లుక్‌ను రియా కపూర్ మరియు సాన్యా కపూర్ స్టైలిష్‌గా డిజైన్ చేశారు. చొక్కా మధ్య బటన్‌ను ఓపెన్‌గా ఉంచడంతో సోనమ్ తన బేబీ బంప్‌ను అందంగా హైలైట్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

అలాగే, ధ్రువ్ కపూర్ రూపొందించిన ఈ డిజైన్ సోనమ్ హుందాతనాన్ని మరింత పెంచేలా, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దబడింది. ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టైల్‌తో సోనమ్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీతా కపూర్ దంపతుల కుమార్తెనే సోనమ్ కపూర్. 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే 3 సంవత్సరాల వాయు అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. సోనమ్ చివరిగా 2023లో విడుదలైన 'బ్లైండ్ (Blind)' చిత్రంలో కనిపించారు. తల్లిగా, నటిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సోనమ్, ఈ రెండో ప్రెగ్నెన్సీ ఫొటోలతో మరోసారి వార్తల్లో నిలిచింది.