వెనిజులా నుంచి క్రూడ్ కొనేందుకు సిద్ధం.. ఇండియా కొత్త ఎనర్జీ వ్యూహం ఇదే..

వెనిజులా నుంచి క్రూడ్ కొనేందుకు సిద్ధం.. ఇండియా కొత్త ఎనర్జీ వ్యూహం ఇదే..

ఇండియా ఎనర్జీ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో కేవలం కొన్ని దేశాల మీదనే ఆధారపడకుండా కొత్త మార్గాల ద్వారా క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా పునరుద్ధరణపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంఈఏ ప్రతినిధి మాట్లాడుతూ.. వెనిజులా వంటి కొత్త సోర్సెస్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతుల వాణిజ్య సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ALSO READ : AIతో ఎఫెక్ట్ కాని బిజినెస్ స్టార్ట్ చేసిన 18 ఏళ్ల కుర్రోడు..

దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి తక్కువ ధరకే క్రూడ్ దొరికే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వెనిజులాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అక్కడి నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఆంక్షల సడలింపుకు తోడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులతో.. భారత్ మళ్లీ ఆ దేశం వైపు చూస్తోంది. కేవలం వెనిజులా మాత్రమే కాకుండా, రష్యా తరహాలో డిస్కౌంట్ ధరకు ఆయిల్ అందించే ఇతర దేశాలతో కూడా చర్చలు జరిపేందుకు భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

ALSO READ : మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

క్రూడ్ దిగుమతుల విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా వాణిజ్య ప్రయోజనాలు, దేశ దీర్ఘకాలిక ఇంధన అవసరాలపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నారు. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. ఎక్కువ సోర్సెస్ నుంచి క్రూడ్ దిగుమతులు ఉండటం వల్ల భవిష్యత్తులో ధరల ఒడిదుడుకుల నుంచి దేశాన్ని రక్షించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. చమురు శుద్ధి కర్మాగారాల సామర్థ్యం పెరగడం, కొత్త రిఫైనరీల ఏర్పాటు నేపథ్యంలో ముడి చమురు కోసం కొత్త సప్లయర్ల అన్వేషణ అనివార్యంగా మారింది.

ALSO READ : నార్త్ ఇండియన్స్.. మా హోటళ్లలో టేబుల్స్ క్లీనింగ్, పానీపూరీ అమ్ముకుంటారు

ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న సమయంలో.. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. కొత్త దేశాల నుంచి పోటీ పెరగడం వల్ల తక్కువ ధరకు ఆయిల్ దొరికే వీలుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్పడుతుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా.. దేశ ప్రయోజనాలే ముఖ్యమనే తీరున భారత విదేశాంగ విధానం సాగుతోందనే విషయాన్ని తాజా ప్రకటన మరోసారి స్పష్టం చేసింది.