42 ఏళ్ల తర్వాత న్యాయం: మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

42 ఏళ్ల తర్వాత న్యాయం: మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

గాంధీనగర్: భారత న్యాయవ్యవస్థలో కేసుల విచారణ జాప్యం అనేది తీవ్రమైన సమస్య. ఇందుకు నిదర్శనమే లేటేస్ట్‎గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మర్డర్ కేసులో 100 ఏండ్ల వృద్ధుడికి 42 సంవత్సరాల తర్వాత న్యాయం దక్కింది. హత్య కేసులో వృద్ధుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా మరోసారి న్యాయ వ్యవస్థలో జాప్యం గురించి చర్చకు దారి తీసింది. 

వివరాల ప్రకారం.. 1982, ఆగస్టు 9న హమీర్‌పూర్ జిల్లాలో గున్వా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు అతడిని కాల్చి చంపారు. ఈ కేసులో మైకు, ధనిరామ్, సత్తిదిన్‎ను 1984లో హమీర్‌పూర్‌లోని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ధనిరామ్, సత్తిదిన్ ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో హైకోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

ALSO READ : అయ్యో పాపం అమ్మాయిని రక్షిద్దామనుకున్నడు..

కేసు విచారణ పెండింగ్‎లో ఉండగానే అనారోగ్యంతో సుత్తిదిన్ మరణించాడు. ధనిరామ్ ఒక్కడే మిగిలిపోయాడు. ఈ పిటిషన్‎పై అలహాబాద్ హైకోర్టులో దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగింది. తాజాగా 2026, ఫిబ్రవరి 4వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. 1984లో హమీర్‌పూర్‌లోని సెషన్స్ కోర్టు ధనిరామ్‌కు విధించిన జీవిత ఖైదు తీర్పును జస్టిస్ చంద్రధరి సింగ్, సంజీవ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధనిరామ్‎ను నిర్దోషిగా ప్రకటించింది.