మున్సిపల్ వార్... 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కో ఆర్డినేటర్లు

 మున్సిపల్ వార్... 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కో ఆర్డినేటర్లు

మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ స్పీడ్ పెంచింది.  మున్సిపల్ ఎన్నికలకు కో- ఆర్డినేటర్లను నియమించింది టీపీసీసీ. 116 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్లకు కో ఆర్డినేటర్స్ ను నియమించింది. 

నిజామాబాద్ కార్పొరేషన్ కి  నలుగురు,  కొత్తగూడెం కార్పొరేషన్ కు ముగ్గురిని కో-ఆర్డినేటర్లుగా నియమించింది పీసీసీ. ప్రతికూల పరిస్థితులు ఉన్న ఈ రెండు కార్పొరేషన్లపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే  మంత్రులకు ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్.   రాష్ట్రంలో  మొత్తం 17 లోక్‌‌‌‌సభ నియోజకవర్గాలు ఉండగా... అందులో హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగడం లేదు. ఇక మిగిలిన 15 నియోజకవర్గాలకు గాను 14 చోట్ల మంత్రులకు, ఆదిలాబాద్ సెగ్మెంట్‌‌‌‌ బాధ్యతలను మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి సీఎం అప్పగించిన సంగతి తెలిసిందే..

 మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా.. 13న ఫలితాలు రానున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నకాంగ్రెస్ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో నేతలతో సమన్వయం చేసుకునేందుకు కో ఆర్డినేటర్లను నియమించింది .