టాలీవుడ్ స్టార్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన 'దూత' (Dhootha) వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, చైతూ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సిరీస్ 'దూత సీజన్ 2' పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
'దూత' వేట మళ్ళీ మొదలు..
తొలి సీజన్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. విక్రమ్ కె. కుమార్ మేకింగ్, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేశాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఇప్పటికే రెండో సీజన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్నాయి. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం దృష్ట్యా, రెండో సీజన్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కథలో మరిన్ని ట్విస్ట్‌లు, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌ను జోడించినట్లు సమాచారం.
ALSO READ : ఫ్యాషన్ ఐకాన్ మరోసారి వైరల్..
ఎప్పుడు ప్రారంభం?
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే, అంటే 2026 రెండో అర్ధభాగంలో 'దూత 2' షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే 'దూత' మొదటి సీజన్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, ఈసారి ఈ క్రేజీ సీక్వెల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా నిర్మించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. చైతన్య తన సొంత బ్యానర్‌లోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారట.
ALSO READ : ఓటీటీలోకి శివకార్తికేయన్ ' పరాశక్తి'..
కథ ఎక్కడ మొదలవుతుంది?
మొదటి సీజన్ చివరలో.. సాగర్ (చైతన్య) తన తప్పులను తెలుసుకున్నప్పటికీ, ఆ శాపం ఇంకా పూర్తిగా వీడలేదని ఒక హింట్ ఇచ్చారు. రెండో సీజన్‌లో కేవలం సాగర్ మాత్రమే కాకుండా, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి షెనాయ్ (పార్వతి తిరువోతు) ఎదుర్కొనే మరిన్ని మిస్టరీలను కూడా చూపించబోతున్నారట. ఈ సీజన్‌లో పాత నటీనటులతో పాటు మరికొంతమంది ప్రముఖ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల పాత్ర ఈసారి మరింత కీలకంగా ఉండబోతోందని సమాచారం.
ALSO READ : చంద్రహాస్ లైవ్ సాంగ్ రచ్చ...
ఒక పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్‌లతో నాగచైతన్య 2026లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'దూత' ఫ్యాన్స్‌కు ఈ సారి కూడా విక్రమ్ కుమార్ తన విలక్షణమైన టేకింగ్‌తో వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..
