ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు గడువు 22 వరకు పెంపు : కులాల అభివృద్ధి శాఖ అధికారి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు గడువు 22 వరకు పెంపు : కులాల అభివృద్ధి శాఖ అధికారి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 5 నెలల గ్రూప్–1,2,3,4, బ్యాంకింగ్, ఆర్ఆర్ బీ, ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోచింగ్ కు దరఖాస్తు గడువును ఈ నెల  22 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు అర్హులన్నారు.

అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 1న, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికైన వారికి 5 నెలలు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్, భోజన వసతి కల్పించి, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 89773 40006 ఫోన్​నంబర్​లో సంప్రదించాలని సూచించారు.