ఊట్కూర్ మండలం కేజీబీవీలో గర్భం దాల్చిన విద్యార్థి

 ఊట్కూర్ మండలం కేజీబీవీలో గర్భం దాల్చిన విద్యార్థి
  •  ప్రేమ పేరుతో యువకుడి మోసం
  • రూ.2.50 లక్షలతో రాజీకి ప్రయత్నం?

ఊట్కూర్, వెలుగు: ఊట్కూర్​ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కేజీబీవీలో చదువుతున్న ఓ బాలిక(16) గర్భవతి అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరకంగా సంబంధం పెట్టుకోవడంతో బాలిక గర్భం దాల్చినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా, పంచాయితీ నిర్వహించి బాలికకు రూ.2.50 లక్షలు ఇప్పించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ప్రస్తుతం బాలికకు అబార్షన్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా, సంక్రాంతి సెలవులకు వెళ్లిన బాలిక ఇప్పటివరకు హాస్టల్‌‌‌‌‌‌‌‌కు రాలేదని, తల్లిదండ్రులను సంప్రదించగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రమేశ్​ వెల్లడించారు.