లింగాల, వెలుగు: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండల కేంద్రానికి చెందిన సింగం బుడ్డయ్య బుధవారం పని నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 5 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.60 వేలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నాడు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకటేశ్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
