పాలమూరు యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలా? : ఏబీవీపీ నాయకులు

పాలమూరు యూనివర్సిటీలో  సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలా? : ఏబీవీపీ నాయకులు

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో పీజీ, లా కోర్సుల్లో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం విద్యార్థులతో కలిసి వర్సిటీ మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీస్​కోకన్వీనర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీలో పీజీ, లా కోర్సుల సిలబస్ పూర్తి చేయకుండానే పరీక్షలు నిర్వహించడం అన్యాయమన్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు.

వర్సిటీ అధికారులు స్పందించి, సిలబస్ పూర్తయ్యే వరకు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు రవితేజ, కార్యదర్శి రవికిశోర్, గర్ల్స్ కోకన్వీనర్ సంగీత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మహేశ్వరి, విభాగ్ గర్ల్స్ -కన్వీనర్ అంబిక తదితరులున్నారు.