తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి గులాబీ రంగు..అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

తిమ్మాపూర్  గ్రామ పంచాయతీకి గులాబీ రంగు..అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

శివ్వంపేట, వెలుగు: మండలంలోని తిమ్మాపూర్ లో ఆదివారం  పంచాయతీ ఆఫీసుకు బీఆర్ఎస్ రంగు వేయడంతో  కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బీఆర్ఎస్,  కాంగ్రెస్ నాయకులకు మధ్య గొడవ జరిగింది. సర్పంచ్ రాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​నాయకులు డిమాండ్​ చేశారు.  అధికారులు జోక్యం చేసుకొని రంగు మారుస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.