Bigg Boss Telugu 9 Finale: బిగ్ ట్విస్ట్.. ఫేక్ ఓట్లతో పొజిష‌న్స్ తారుమారు.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరంటే?

Bigg Boss Telugu 9 Finale: బిగ్ ట్విస్ట్.. ఫేక్ ఓట్లతో పొజిష‌న్స్ తారుమారు.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇవాళ ఆదివారం (2025 డిసెంబర్ 21న) గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. ప్రస్తుతం హౌస్‌లో టైటిల్ కోసం కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన గల్రానీ పోటీ పడుతున్నారు. ఇప్పటికే, కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అయ్యండంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే, బిగ్ బాస్ చరిత్రను పరిశీలిస్తే, చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణ్ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ, తనూజ ఆర్మీ కూడా సైలెంట్‌గా ఓటింగ్ పెంచుకుంటూ వస్తోంది. అంతేకాదు.. వీరిద్దరి మధ్య ఓట్ల శాతం కూడా చాలా తక్కువ ఉండటంతో విజేత విషయంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలోనే విన్నర్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. అంతా కళ్యాణ్ కళ్యాణ్ అంటున్నారు కానీ.. అలా అనుకున్న వాళ్లకి బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వైరల్ అవుతుంది. అందుకు కారణం లేకపోలేదు. బిగ్ బాస్ ఓటింగ్లో ఫేక్ ఓట్లతో రిజల్ట్ తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఈఫేక్ ఓట్లు టాప్-5లో ఉన్న అందరికీ పడ్డాయంటున్నాయి బిగ్ బాస్ వర్గాలు.

►ALSO READ | Shambhala Trailer: ఉత్కంఠగా ఆది ‘శంబాల’ ట్రైలర్.. డిసెంబర్ 25న థియేటర్లో బిగ్ బ్లాస్ట్..

అందువల్ల ఈ ఓట్ల ఆడిటింగ్ తర్వాత రిజల్ట్ తారుమారు కావొచ్చనే మరో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గ్లోబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ వేదికపై అతిథులుగా మెరిసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బిగ్ బాస్ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ ఫినాలే కానుంది.

బిగ్ బాస్-9 సీజ‌న్‌లో ఎలిమినేట్ అయిన స‌భ్యులు:

1వ వ‌రంలో శ్రాస్తి వర్మ
2వ వారంలో మనీష్ మర్యాద
3వ వారంలో ప్రియా శెట్టి
4వ వారంలో హరిత హరీష్
5వ వారంలో ఫ్లోరా సైనీ, శ్రీజ దమ్ము
6వ వారంలో భరణి శంక‌ర్‌
7వ వారంలో రమ్య మోక్షం
8వ వారంలో మాధురి దువ్వాడ
9వ వారంలో శ్రీనివాస్ సాయి
10వ వారంలో నిఖిల్ నాయర్ మరియు గౌరవ్ గుప్తా ఇద్దరూ
11వ వారంలో ఎలిమినేషన్ లేదు
12వ వారంలో దివ్య నిఖిత
13వ వారంలో రీతు చౌదరి
14వ వారంలో సుమన్ శెట్టి , భరణి శంక‌ర్‌