టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఢిల్లీ భామ రాశీ ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' అంటూ మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్టులతో వెనుదిరిగి చూసుకోలేనంత బిజీగా ఉంది. ఇటీవలే 'తెలుసు కదా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉందీ బ్యూటీ.
'ఉస్తాద్' ఫోటోగ్రాఫర్ గా..
రాశీ ఖన్నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశీ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపించబోతోంది. దీనికి సంబంధించి ఆమె కెమెరా పట్టుకున్న పోస్టర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ పై పండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు.
పాన్ ఇండియా బాటలో క్రేజీ ప్రాజెక్ట్స్
కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రాశీ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం హిందీలో విక్రాంత్ మాస్సేతో కలిసి 'తలాఖోన్ మే ఏక్' చిత్రంలో నటిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్, విద్యాబాలన్ లతో కలిసి అనీస్ బజ్మీ కామెడీ ఎంటర్టైనర్‌లో భాగం కానుంది. అమెజాన్ ప్రైమ్ సెన్సేషన్ 'ఫర్జీ 2' వెబ్ సిరీస్ షూటింగ్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. అటు తమిళంలోనూ ఫుల్ బిజీగా ఉందీ భామ. సిద్ధార్థ్ సరసన 'రౌడీ అండ్ కో' (Rowdy & Co) అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌లో అలరించనుంది.
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ..
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో నిరంతరం టచ్‌లో ఉంటుంది రాశీ. లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. 'ఏ లిటిల్ రాయల్, ఏ లిటిల్ క్వైట్' (కొంచెం రాజసం.. కొంచెం మౌనం) అంటూ క్యాప్షన్ ఇచ్చి కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. 'వివాని బై వాని వాట్స్' బ్రాండ్ కి చెందిన సిల్వర్ ఎంబెల్లిష్డ్ శారీలో రాశీ దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ రాయల్ లుక్ చూసిన అభిమానులు వరుస హిట్లతో పాటు అందంలోనూ రాశీకి తిరుగులేదు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
