టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘ కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ' ( Maremma ) . గ్రామీణ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ ను లేటెస్ట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ చూస్తుంటే ఒక పవర్ ఫుల్ రూరల్ రస్టిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఊరిని చుట్టుముట్టిన వింత వ్యాధి..
టీజర్ ప్రారంభమే చాలా ఇంటెన్సింగా ఉంది. ఒక పల్లెటూర్లో హఠాత్తుగా మనుషులు, పశువులు వింత వ్యాధి బారిన పడి మరణిస్తుంటారు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు తమ ఊరిని కాపాడాలంటూ గ్రామ దేవత మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే అమ్మవారి పవిత్ర దున్నపోతు అదృశ్యం కావడంతో కథలో ఊహించని మలుపు తిరుగుతుంది.
ఆ పవిత్ర దున్నపోతును కాపాడే బాధ్యత హీరోపై ఉంటుంది. తన ఊరిని, నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్య యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నదే ఈ సినిమా ప్రధానాంశం. టీజర్‌లో మాధవ్ మాస్ లుక్, రగ్గడ్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన బాబాయ్ రవితేజ బాడీ లాంగ్వేజ్‌ను గుర్తు చేస్తూ మాధవ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భారీ తారాగణం..
మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఒక పవర్‌ఫుల్ విలేజ్ హెడ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం (BGM) టీజర్‌కు ప్రాణం పోసింది. పల్లెటూరి వాతావరణాన్ని తన సంగీతంతో చక్కగా ఎలివేట్ చేశారు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్స్ క్వాలిటీ పరంగా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రవితేజ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త హీరో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తాడని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
