LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!

LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)..ఇండస్ట్రీలో ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుదంటే..నేషనల్ వైడ్ గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. రీసెంట్ గా ఈ దర్శకుడి నుండి వచ్చిన లియో (Leo) మూవీ కలెక్షన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో దళపతి విజయ్(Vijay) అయినప్పటికీ..కేవలం లోకేష్ అనే పేరువల్లనే అంత హైప్ క్రియేట్ అయ్యింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అలాగే లోకేష్ తన సినిమాలను ఒకదానితో ఒకటి లింకప్ చేసి..లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ను క్రియేట్ చేసి..ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్నారు. 

అయితే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి వివరించడానికి, దానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథతో, అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కథలన్నీ ఎక్కడ మొదలయ్యాయి అనే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ కూడా పూర్తిచేశారు. ఈ షార్ట్ ఫిలింకు లోకేష్ ‘పిళ్లైయార్ సుజి’ అనే తమిళ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీని అర్ధం బిగినింగ్.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా మొదలయ్యిందో..అందుకు సంబంధించిన కారణాలు ఏంటో ఇందులో వివరించబోతున్నాడట లోకేష్. ఇక ఈ షార్ట్ ఫిలింలో విలక్షణ నటులు అర్జున్ దాస్, నరేన్, కాళిదాస్ జయరామ్..లతో పాటు పలువురు కీ రోల్స్ లో నటిస్తున్నారు.త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం గురించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తారట. అయితే ఈ షార్ట్ ఫిలింను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా? లేక ఏదైనా ఓటీటీ ప్రీమియర్ కి ఇస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో కూలీ సినిమా షురూ చేశాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు.