కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో నటించాలనే కల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో నెరవేరిందని చెప్పింది రాశీ ఖన్నా. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు.
‘‘పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశా. ఇందులో నా పాత్ర పేరు శ్లోక. మోడరన్ అమ్మాయిగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తా. నా పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. నాకొక మాస్ సాంగ్ కూడా ఉంది. డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా.
పవన్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు.. కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నా. హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నా. శ్రీలీలతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.
‘గబ్బర్ సింగ్’ లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ సినిమా కోసం ప్రాణం పెట్టే నిర్మాతలు. ఈ బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా.
ఇక ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ షో చేస్తున్నా. అమెజాన్ సిరీస్‌లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా. తమిళంలో ‘రౌడీ అండ్ కో’లో నటిస్తున్నా. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నా’’... అని రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
