ముగియనున్న కస్టడీ.. అఖిలప్రియకు 200 ప్రశ్నలు

ముగియనున్న కస్టడీ.. అఖిలప్రియకు 200 ప్రశ్నలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రియల్టర్ ప్రవీణ్​రావు కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నార్త్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ డీసీపీ కల్మేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో విమెన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు వరుసగా మూడోరోజు అఖిలప్రియను విచారించారు. బుధవారం ఆమె స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మూడ్రోజుల కస్టడీలో అఖిలప్రియను దాదాపు 200కు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అయితే వీటిలో చాలా వాటికి తనకు తెలియదనే ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం. హఫీజ్ పేట భూముల వివాదంతో పాటు ఏవీ సుబ్బారెడ్డి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రావు ఫ్యామిలీల మధ్య గొడవల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రావు కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ అయిన రోజు అఖిలప్రియ లోధా అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నట్లు గుర్తించారు. టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొకేషన్‌‌‌‌‌‌‌‌, కాల్‌‌‌‌‌‌‌‌డేటా టైమ్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా వివరాలు రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఏవీ సుబ్బారెడ్డితో భూమా ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌ సంబంధాలను అడిగి తెలుసుకున్నారు. అఖిలప్రియ కస్టడీ గురువారంతో ముగియనుండడంతో జడ్జి ఎదుట ప్రొడ్యూస్‌‌‌‌‌‌‌‌ చేసి, చంచల్‌‌‌‌‌‌‌‌గూడ మహిళా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

పోలీసుల అదుపులో 10 మంది..

పోలీసులు బుధవారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య10కి చేరింది. పరారీలో ఉన్న భార్గవరామ్‌‌‌‌‌‌‌‌ కోసం 8 టీమ్స్‌‌‌‌‌‌‌‌ గాలిస్తున్నాయి. గుంటూరు శ్రీను కోసం గోవా, బెంగళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏపీలో పోలీసులు సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అఖిలప్రియ సోదరుడు జగత్‌‌‌‌ విఖ్యాత్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుర్గా నుంచి కీలక వివరాలు రాబట్టారు. భార్గవరామ్‌‌‌‌‌‌‌‌, గుంటూరు శ్రీనుతో కలిసి జగన్‌‌‌‌‌‌‌‌ విఖ్యాత్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రావు ఇంటికి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. మొయినాబాద్‌‌‌‌‌‌‌‌లోని భార్గవరామ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రావు, సునీల్‌‌‌‌‌‌‌‌, నవీన్‌‌‌‌‌‌‌‌లను బంధించినట్లు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రావు ఫ్యామిలీ నుంచి సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కడున్నాయని ఆరా తీస్తున్నారు.

నిందితులందరినీ అరెస్టు చేస్తం...

ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. కస్టడీలో అఖిలప్రియ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశాం. కోర్టుకు సబ్మిట్ చేస్తాం. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌తో దర్యాప్తు చేస్తున్నాం. రెండు మూడ్రోజుల్లో  నిందితులందరినీ అరెస్ట్ చేస్తాం.