డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!

డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మొదలయ్యాక సైబర్​ నేరాలు ఎక్కువైపోయాయి. ఏఐని వాడుకుని సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఫాల్స్​ న్యూస్ స్ర్పెడ్ చేస్తున్నారు కొందరు. అందులో ముఖ్యంగా డీప్​ ఫేక్​ ఫీచర్ ఒకటి. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు  ఇబ్బందులు పడ్డారు. దీనికి సొల్యూషన్ వెతికే క్రమంలోనే ఫేక్​ వీడియోలను కనిపెట్టే డిటెక్టర్ ఒకటి కనుగొన్నారట. 

దాన్ని డీప్​ ఫేక్ డిటెక్టర్​ ‘DALL–E’ అంటారు. దీని ద్వారా అసలు, నకిలీ వీడియోలను కనిపెట్టొచ్చు అంటున్నారు రీసెర్చర్లు. అంతేకాదు.. ‘DALL-–E3’ ద్వారా జనరేట్​ చేసిన ఇమేజ్​ని లేటెస్ట్​ వెర్షన్ 98.8 శాతం కరెక్ట్​గా డిటెక్ట్​ చేస్తుందట. అయితే... మిడ్​జర్నీ, స్టెబిలిటీ వంటి మిగతా జనరేటర్​ల ద్వారా క్రియేట్ చేసిన వాటిని ఇది గుర్తించలేదని కంపెనీ తెలిపింది. అలాగే ఓపెన్ ఏఐ సంస్థ, ఇమేజ్​ని ఈజీగా గుర్తించడానికి, చెరపడానికి వీల్లేని వాటర్​ మార్కింగ్ ఫీచర్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.