నెలరోజులు సెల్‌ఫోన్ వాడకాన్ని మానేస్తే..మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు!

నెలరోజులు సెల్‌ఫోన్ వాడకాన్ని మానేస్తే..మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు!

ప్రస్తుత  డిజిటల్ ప్రపంచంలో  సెల్ ఫోన్ లేకుండా ఏపని జరగదు. ఇది మనందరికి తెలుసు. వర్క్ నుంచి ఎంటర్ టైన్ మెంట్, చెల్లింపులు నుంచి లెక్కింపుల వరకు చాలా పనులు ఇప్పుడు మొబైల్ లోనే జరుగుతున్నాయి. చాలా మంది లేవగానే ఫోన్ పట్టకుండా ఉండలేరు. అలాగే నిద్ర పోయే ముందు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేదు. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ తో అన్ లిమిటెడ్ బ్రౌజింగ్ రోజువారి దినచర్యలో ఓ భాగమై పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరెప్పుడైన నెలరోజుల పాటు ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా?..అది మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుంది, వచ్చే మార్పులేంటో తెలుసుకుందాం..
సెల్ ఫోన్ ఒక నెలరోజులపాటు వాటకుండా ఉంటే అనేక లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.  అవేంటో చూద్దాం.. 

మానసిక ఒత్తిడి తగ్గుతుంది..

మన ఫోన్లు ఎదో ఒక మేసేజ్.. నోటిఫికేషన్లు, న్యూస్, వర్క్ అప్డేట్స్, సోషల్ మీడియా పోస్టులతో మనల్ని ముంచెత్తుతుంది. ఇవి మన ఆందోళన, మానసిక  అలసటకు దారి తీస్తాయి. ఫోన్ చూడకుండా పక్కన పెడితే  మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి ఆందోళన  చాలా వరకు తగ్గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మంచి నిద్ర..

మనం ఫోన్ చూస్తున్నపుడు  వెలువడే నీలి కాంతి కిరణాలతో నిద్ర లేమి సమస్య వస్తుంది. రాత్రి పూట ఫోన్ వాడకం వల్ల ఈ కిరణాలు నిద్రకు  చెడగొడతాయి. ఫోన్ వాడకం మానేస్తే..మన శరీరం పనితీరును  రీసెట్ చేస్తుంది .మంచినిద్రను పొందవచ్చు. 

కంటి ఆరోగ్యం.. 

అధికంగా ఫోన్ వాడితే కంటిపై  ఒత్తిడికి దారి తీస్తుంది.దీనిని స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు  కండ్లు పొడిబారడం, చికాకు, వాపు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్ నుంచి కొంతకాలం దూరంలో ఉంటే కళ్లకు విశ్రాంతి  లభిస్తుంది. తద్వారా కంటి అలసట తగ్గుతుంది. ఎక్కువ కాలం దృష్టి లోపాలు రాకుండా ఉంటాయి. 

శారీరక శ్రమ..

నిరంతరం  ఫోన్ చేతిలో ఉంటే పనేం చేస్తాం.. అందుకే శారీరక శ్రమ తగ్గుతుంది. స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తే సహజంగానే చురుకైన జీవన శైలి పొందవచ్చు. ఆరోగ్యకరమైన బరువు, మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చు. 

సామాజిక కార్యక్రమాల్లో.. 

సామాజిక  చర్యలు ఎక్కువగా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇది వాస్తవ జీవిత కనెక్టివిటీపై ప్రభావం చూపిస్తుంది. ఫోన్ వాడకం తగ్గిస్తే నేరుగా వ్యక్తులను కలవడం ద్వారా వీలు క లుగుతుంది. కుటుంబం,స్నేహితుల
తో ఎక్కువ సమయం గడపచ్చు. ఇవి డిజటల్ కమ్యూనికేషన్ కంటే ఎక్కువ భావోద్వేగ సంతృప్తిని ఇస్తాయి. 

స్మార్ ఫోన్ వాడకం మన ఏకాగ్రతను దృష్టి మరల్చుతాయి. ఫోన్ వాడకం తగ్గిస్తే .. నోటిఫికేషన్లు, మేసేజ్ లనుంచి ఎలాంటి ఆటంకం ఉండదు. తద్వారా మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది. నెల రోజుల పాటు ఫోన్ వాడకం తగ్గిస్తే వ్యక్తిగత , వృత్తిపరమైన యాక్టివిటీస్ పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. 

అందుకే ఇక నైనా సెల్ ఫోన్  అధికంగా వాడే వాళ్లు.. మొత్తం కాకకపోయిన తక్కువ స్ర్కీన్ టైం  కేటాయించి ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత , వృత్తిపరమైన యాక్టివిటీస్ పెంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందండి.