అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో ట్రంప్, ఖమేనీల మాటల యుద్దంసాగుతోంది. ఇరాన్ లో పాలన మారే రోజులు దగ్గర పడ్డాయని ట్రంప్ ఓ వైపు వార్నింగ్ ఇస్తుండగా సుప్రీం లీడర్ ఖమేనీ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. యుద్ద మే గనక వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మీ యుద్ద నౌకలు మమ్ములను ఏమీ చేయలేవని.. ప్రపంచంలోని శక్తివంతమైన మీ యుద్ద నౌకలను సముద్రపు అడుగున తొక్కుతామంటూ ఖమేనీ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ సమీపంలో సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ద నౌకలు, సైన్యం చేరుకున్న వేళ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం, అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడంపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం X వేదిక గా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. మాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అనిట్రంప్ పదే పదే చెబుతున్నారు. అంతశక్తివంతమైన సైన్యం కూడా కొన్నిసార్లు కోలుకోలేని దెబ్బ తింటుంది.. తిరిగి మళ్లీ లేవదు అంటూ ఖమేనీ తన పోస్టు రాశారు.
ఇరాన్ సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ క్రమంలో ఖమేనీ స్పందిస్తూ.. అమెరికా బలగాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్ కు ఉందని హెచ్చరించారు. ఇరాన్ వైపు యుద్ద నౌకను పంపామని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అమెరికా యుద్ద నౌక ప్రమాదకరమైన సైనిక శక్తి కావొచ్చు. అయితే ఆ యుద్ద నౌకకంటే ప్రమాదకరమైనది, యుద్ద నౌకను సముద్రపు అడుగు భాగానికి పంపంచే ఆయుధం మా దగ్గరు ఉందంటూ హెచ్చరించారు ఖమేనీ.
గత కొన్నేళ్లుగ ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ట్రంప్ పదే పదే ఇరాన్ నాయకత్వాన్ని బెదిరించడం, అణు కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ కార్యకలాపాలను అబ్జర్వ్ చేసేందుకు ఇరాన్ సమీపంలో యుద్ధనౌకలను మోహరించింది. గతేడాది ఇరాన్ అణు రియాక్టర్ కేంద్రాల్లో లక్ష్యంగా మిడ్ హామర్ పేరుతో అమెరికా ఇరాన్ పై దాడులు చేసింది. అప్పటినుంచి సైనిక చర్యలు తప్పవం టూ ఇరాన్ ను అమెరికా బెదిరింపులకు పాల్పడుతున్న వేళ.. తాజాగా ఖమేనీ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్ లో మరింత ఉద్రిక్త పరిస్థితులకు ఉసిగొల్పింది.
The US President keeps saying that they have the strongest military force in the world. The strongest military force in the world may at times be struck so hard that it cannot get up again.
— Khamenei.ir (@khamenei_ir) February 17, 2026
