రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కీలకమైన నిజామాబాద్‌సహా రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నల్గొండ మేయర్ సీట్లను అధికారపార్టీ దక్కించుకున్నది. కొత్తగూడెం మేయర్‌పీఠాన్ని కాంగ్రెస్మద్దతుతో మిత్రపక్షం సీపీఐ అధిరోహించింది. ఇక ఊహించినట్లే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలో పడింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే చైర్ పర్సన్స్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్‌కు కేవలం 18 మున్సిపాలిటీలు దక్కాయి. కార్పొరేషన్లలో ఆ పార్టీ ఈసారి జీరోగా మిగిలిపోయింది.
