ముంబై: అంతర్జాతీయ వేదికలపై భారత్ ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్ ఎక్స్ పీరియెన్స్, భారత్ నైపుణ్యం కలిస్తే అద్భుతాలు సాధించొచ్చన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, భద్రతా సవాళ్లు, ఆర్థిక సంక్షోభం లాంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో రెండు దేశాల భాగస్వామ్యం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు.
మంగళవారం (ఫిబ్రవరి 17) ఇండియాపర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ముంబైలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక , వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. భారత్, ఫ్రాన్స్ ల మధ్య పలు కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపారు.
అంతకుముందు H125 లైట్ యూటిలిటీ హెలికాప్టర్ అసెంబ్లింగ్ సెంటర్, నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ ను మాక్రాన్ తో కలిసి ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రెండు కేవలం సంస్తలు మాత్రమే కాదు.. భవిష్యత్తున నిర్మించే వేదికలని ప్రధాని మోదీ అన్నారు.
