ట్రిపుల్ జంప్‌లో అదరగొట్టిన ప్రవీణ్, సెల్వప్రభు.. సిల్వర్, బ్రాంజ్ పతకాలు సొంతం

ట్రిపుల్ జంప్‌లో అదరగొట్టిన ప్రవీణ్, సెల్వప్రభు.. సిల్వర్, బ్రాంజ్ పతకాలు సొంతం

CWG 2026 Triple Jump: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత జంపింగ్ వీరులు సంచలనం సృష్టించారు. పురుషుల ట్రిపుల్ జంప్ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్‌కు డబుల్ పోడియం ఫినిష్ దక్కింది. జాతీయ రికార్డు హోల్డర్ ప్రవీణ్ చిత్రావెల్ రజత పతకాన్ని (Silver) కైవసం చేసుకోగా, యంగ్ అండ్ రైజింగ్ స్టార్ సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్య పతకాన్ని (Bronze) సొంతం చేసుకున్నాడు. ఒకే వేదికపై ఇద్దరు భారత అథ్లెట్లు మెడల్స్ సాధించడంతో కామన్వెల్త్ గేమ్స్ మెడల్ సెరెమనీలో రెండు భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. 

14 సెంటీమీటర్ల తేడాతో స్వర్ణం మిస్: 
గత 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కేవలం 3 సెంటీమీటర్ల తేడాతో పతకాన్ని కోల్పోయి తీవ్ర నిరాశకు గురైన ప్రవీణ్ చిత్రావెల్, ఈసారి పట్టుదలతో దూకి తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. నాలుగో ప్రయత్నంలో ప్రవీణ్ అత్యుత్తమంగా 16.58 మీటర్లు దూకి రజత పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. జమైకాకు చెందిన జోర్డాన్ స్కాట్ 16.72 మీటర్లతో గోల్డ్ మెడల్ గెలవగా.. కేవలం 14 సెంటీమీటర్ల స్వల్ప తేడాతో ప్రవీణ్‌కు స్వర్ణం చేజారింది.

సీజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో మెరిసిన సెల్వ ప్రభు: 
మధురైకి చెందిన 21 ఏళ్ల యువ కెరటం సెల్వ ప్రభు తిరుమరన్ అంతర్జాతీయ వేదికపై తన జోరును కొనసాగించాడు. ఫైనల్లో క్రమక్రమంగా రాణిస్తూ ఐదో ప్రయత్నంలో తన సీజన్ బెస్ట్ 16.52 మీటర్లు దూకి కాంస్య పతకాన్ని ముద్దాడాడు.

ప్రవీణ్, సెల్వ ట్రాక్ రికార్డ్: 
ప్రవీణ్ చిత్రావెల్: 2018 యూత్ ఒలింపిక్స్ బ్రాంజ్, 2023 ఆసియా ఇండోర్ సిల్వర్, హాంగ్‌జౌ ఆసియా గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ అయిన ప్రవీణ్ చిత్రావెల్.. 17.37 మీటర్లతో భారత నేషనల్ అవుట్‌డోర్ రికార్డును తన పేరిటే కలిగి ఉన్నాడు.

Also Read : ఐర్లాండ్ చేతిలో భారత్‌కు జరిగిన అవమానం గుర్తు పెట్టుకోండి

సెల్వ ప్రభు: 2022 వరల్డ్ U20 సిల్వర్ మెడలిస్ట్ అయిన సెల్వ, 2023లో బెస్ట్ ఏసియన్ U20 మేల్ అథ్లెట్'గా నిలిచాడు. ఈ ఏడాది 17.05 మీటర్లతో పర్సనల్ బెస్ట్ నమోదు చేసి NCAA డివిజన్-1 అవుట్‌డోర్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు.