దేశంలో నీట్ పేపర్ లీక్ తర్వాత రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. సీజేపీ ఆందోళనలు, వారికి మద్ధతుగా ప్రతిపక్షాల నిరసనలతో మారిన రాజకీయ వాతావరణం.. ఆ తర్వాత ఈ20 పెట్రోల్ అంశంపై మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, మేధావులు రెండుగా చీలిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించిన ఒక మహిళా ప్రొఫెసర్.. సోషల్ మీడియా వేదికగా నవ్వులపాలయ్యింది.
వెస్ట్ బెంగాల్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాహుల్ టార్గెట్ చేసి హైలైట్ అవ్వాలని చూసిన ఆమె.. అది బూమరాంగ్ లాగా బ్యాక్ ఫైర్ అవుతుందని ఊహించలేకపోయి ఉంటుంది.
అర్పితా ఛటర్జీ అనే ప్రొఫెసర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ ఫోకస్ రాహుల్ నుంచి ప్రొఫెసర్ పైకి షిఫ్ట్ అయ్యింది. ఆమె చేసిన విమర్శలకు బదులు.. ఆమె గ్రామాటికల్ మిస్టేక్స్ పై పంచుల మీద పంచులు వేస్తూ ఫార్వార్డ్ చేయడం.. ఆన్ లైన్ లో పెద్ద డిబేట్ క్రియేట్ చేసింది.
వివాదాస్ప పోస్ట్..?
ఆమె పోస్ట్ లో తనకు రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయని పేర్కొన్నారు అర్పిత.అలాగే ఒక బీఈడీ ఉందని.. ప్రస్తుతం పీహెచ్డీ (PhD) చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాహుల్ ను ప్రశ్నిస్తూ నేను అంధభక్త్ అని గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు. రాహుల్ గాంధీ దృష్టిలో అంధభక్తులు అందరూ ఇడియట్స్ అయితే.. ఇంత చదువు చదివి, ఇన్ని పట్టాలనున్న నేను కూడా ఇడియట్ నా.. ఆర్ యు షూర్.. అంటూ ప్రశ్నించారు.
ఆమె చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. రెండు డిగ్రీలు, బీఎడ్ ఉండి.. పీహెచ్ డీ చేస్తున్న ప్రొఫెసర్ ఇంగ్లీష్ పై హేళన చేస్తూ పోస్ట్ వైరల్ చేశారు. పోస్ట్ లో వ్యాకరణ దోషాలున్నట్లు కామెంట్స్ చేశారు.
Dear @RahulGandhi , I am a proud Andhbhakt and an assistant professor, having two master’s degree(English and Education), having B.Ed. Degree too and pursuing PhD.
— Arpita Chatterjee (@asliarpita) July 29, 2026
According to you an Andhbhakt is an IDIOT.
Am I an IDIOT ! Are you sure ?
సోషల్ మీడియా రియాక్షన్స్:
మీరు నిజంగానే ఇడియట్.. ఎందుకంటే రెండు మాస్టర్ డిగ్రీలు కలిగి ఉండి.. మీకు ఇప్పటికీ ఇంగ్లీష్ పై పూర్తి అవగాహన లేదని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ లో చాలా మిస్టేక్స్ ఉన్నట్లు కన్ఫమ్ అయితే.. ఎవరైనా ఏమనుకోవాలి.. మీకు డిగ్రీలు స్కిల్ తోనే వచ్చాయా.. అనే ప్రశ్న రాదా..? అంటూ ప్రశ్నించారు.
మరో యూజర్ రిప్లై ఇస్తూ.. మేడం మీకు ఉన్నాయి వాస్తవమే.. కానీ మీరు చేసిన స్టేట్ మెంట్ చూస్తే మీరు అక్షరాస్యులే (లిటరేట్) కానీ చదువు వచ్చిన వాళ్లు కాదు (నాట్ ఎడ్యుకేటెడ్) అంటూ పోస్ట్ చేశారు.
మూడో యూజర్ .. మీ పోస్ట్ ను బట్టీ ఏం తెలుస్తుందంటే.. డిగ్రీలు చేస్తే జ్ఞానం, శ్రాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ధోరణి వస్తుందని గ్యారెంటీ ఇవ్వవనేది అర్ధమవుతోందని కామెంట్ చేశారు. ఇన్ని డిగ్రీలు ఉన్నా మీరు నిజంగా అంధభక్తులే అంటూ రిప్లై ఇచ్చారు.
మిస్టేక్స్ ఇవే:
ఆమె పోస్ట్ లో ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఆశిష్ జోషి అనే యూజర్ వివరిస్తూ ట్వీట్ చేశారు.
having two master's degree కాదు.. having two master's degrees.. కరెక్ట్
pursuing PhD తప్పు.. pursuing a PhD అని రాయాలి.
B.Ed. Degree - B.Ed. degree కరెక్ట్. ఇక్కడ డిగ్రీకి క్యాపిటల్ లెటర్ అవసరం లేదు.
Am I an IDIOT ! ఇక్కడ ఆశ్చర్యార్థక గుర్తుకు ముందు స్పేస్ అవసరం లేదు. Am I an IDIOT! కరెక్ట్.
