లండన్‌కు చెందిన పాపులర్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) కొత్త ఫోన్ 4a (Nothing Phone 4a) సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం ఈ లాంచ్ మార్చి 5, గురువారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. లండన్ నుంచి 'nothing.tech' వెబ్‌సైట్ ద్వారా ఈ లాంచ్ ప్రోగ్రామ్ లైవ్‌గా చూడవచ్చు.
ఈ ఫోన్ పై నథింగ్ కంపెనీ సీఈఓ కార్ల్ పీ (Carl Pei) మాట్లాడుతూ ఎక్కువ ఖర్చు పెట్టకుండానే, ఖరీదైన ఫోన్లలో ఉండే అనుభవాన్ని ఈ ఫోన్ ఇస్తుందని చెప్పారు. నథింగ్ ఫోన్లు అంటేనే వెనుక Transparent డిజైన్‌తో ఉంటాయి. అయితే ఈసారి ఒక సరికొత్త, అట్రాక్టివ్ రంగులో ఈ ఫోన్ రాబోతోందని హింట్ ఇచ్చారు.
ఫోన్ బాడీ మెటీరియల్స్, డిజైన్, స్క్రీన్ క్వాలిటీ ఇంకా కెమెరాలని ఇంతకుముందులా కంటే చాలా మెరుగుపరిచినట్లు కంపెనీ చెబుతోంది. 2025లో నథింగ్ కంపెనీ 45% వృద్ధిని సాధించి, ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.
కొంతకాలం క్రితం బెంగళూరులో నథింగ్ మొదటి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు, దాదాపు 2,000 మందికి పైగా జనం క్యూ కట్టారు. దీన్ని బట్టి ఇండియాలో ఈ ఫోన్లకు ఉన్న డిమాండ్, క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. డిజైన్‌కు ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేయడానికి, లండన్‌లోని ఫెమస్ సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ అనే ఆర్ట్ అండ్ డిజైన్ కాలేజీలో ఈ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి, ఫీచర్స్ అలాగే పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఇందులో ఒకటి కంటే ఎక్కువ మోడల్స్ (4a Series) ఉండవచ్చని సమాచారం. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
