మంగళవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. రేట్ల తగ్గుదలకు రష్యానే కారణమా..?

మంగళవారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. రేట్ల తగ్గుదలకు రష్యానే కారణమా..?

చెల్లింపులకు డాలర్ల వినియోగం విషయంలో రష్యా తీసుకున్న  నిర్ణయం బంగారం, వెండి లోహాల రేట్లను తగ్గిస్తున్నాయని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పసిడి ధర రోజురోజుకూ మెల్లమెల్లగా తగ్గుతూ ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో వెండి కూడా అదే దారిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా తమ ప్రాంతంలోని తాజా రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

ఫిబ్రవరి 17న బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను అందించాయి. దీంతో ఫిబ్రవరి 16 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.153 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 491గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 200గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే ర్యాలీ కొంత నెమ్మదించిందని నిపుణులు అంటున్నారు. అయితే మంగళవారం ఫిబ్రవరి 17, 2025న వెండి రేటు కేజీకి రూ.15వేలు తగ్గి ఊరటను ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 65వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.265 వద్ద ఉంది.