
బంగారం, వెండి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. దేశంలో బంగారం, వెండి ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం రూ.75 వేలకు చేరువగా దూసుకుపోతోంది.ఇక, వెండి ధరలు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. లక్షకు చేరువైంది. ఈ క్రమంలో బంగారం, వెండి ఆభరణాలు కొనాలనే ఆలోచన చేసేందుకు కూడా సామాన్య జనాలు భయపడే పరిస్థితి నెలకొంది.
మే 18వ తేదీ శనివారం దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870 పెరిగింది. ఇక, కిలో వెండి ధర రూ.3900 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.4వేలు పెరిగింది. దీంతో వెండి ధర రూ. 96,500కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,620గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,770గా ఉంది. కిలో వెండి ధర రూ.93వేలు ఉంది.
ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,620గాఉంది. కిలో వెండి ధర రూ.93వేలు ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,500ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,730గా ఉంది. కిలో వెండి ధర రూ.69,500గా ఉంది.
బెంగళూరులో 2 2క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.74,620గా ఉంది. కిలో వెండి ధర రూ.89వేలకు చేరుకుంది.