గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోందిలో కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత జరిగింది. పోలింగ్‌స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గూమిగూడి ఉన్నారు. ఇచ్చోడ ఎస్‌ఐ పురుషోత్తం అక్కడికి చేరుకుని చెదరగొట్టేందుకు యత్నించాడు. పరిగెత్తే క్రమంలో గ్రామస్తుడు జక్కుల విలాస్ గోడ దూకుతూ జారి డ్రైనేజీలో పడ్డాడు. దీంతో అతడి రెండు కాళ్లు విరిగాయి. విలాస్ కొడుకు అభినవ్ వెళ్లి ఆగ్రహంతో ఎస్‌ఐ పురుషోత్తంపై రాళ్లతో దాడికి దిగాడు. దీంతో ఎస్‌ఐ తలకు గాయమైంది. అక్కడితో ఆగకుండా అభినవ్ పోలీసు వెహికల్ అద్దాలు పగులగొట్టాడు. అభినవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఎస్‌ఐను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.
