టాలీవుడ్ లో వైవిధ్యమైన కథనలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేస్తుకున్న హీరో అడవి శేష్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. ఈసారి ఒక సరికొత్త రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఈ చిత్రంలో అడివి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
లేటెస్ట్ గా వచ్చినఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. కింగ్ నాగార్జున క్లాసిక్ హిట్ 'హలో బ్రదర్'లోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా.. అడివి శేష్ తన మార్క్ స్టైలిష్ యాక్షన్‌తో ఎంట్రీ ఇచ్చారు. టీజర్ ఆఖర్ లో ఒక చిన్నారి అడివి శేష్‌ను చూసి నిష్కల్మషంగా నువ్వు డాక్టర్‌వా? అని అడిగితే, శేష్ అంతే తీక్షణంగా నేను దొంగని అని ఇచ్చే రిప్లై టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. రొమాన్స్, యాక్షన్ మిళితమైన ఈ టీజర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
పాన్-ఇండియా అప్పీల్..
'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అడివి శేష్ సినిమాల్లో ఉండే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, షానీల్ డియో మేకింగ్ స్టైల్ కలిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి కలయిక సినిమాకు పాన్-ఇండియా అప్పీల్‌ను తీసుకొస్తోంది. విలక్షణమైన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న బాణీలు ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రేక్షకులకు 2026 ప్రారంభంలోనే ఒక భారీ ట్రీట్ అందబోతోంది. 2026 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అడివి శేష్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుస హిట్లతో ఉన్న అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ల కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'దొంగ'గా శేష్ చేసే ఈ వినూత్న ప్రయాణం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది ఉగాది వరకు ఆగాల్సిందే!
