టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన పాపులర్ స్కూటర్ 'సుజుకి యాక్సెస్ 125'లో సరికొత్త భద్రతా ఫీచర్‌ను పరిచయం చేసింది. 125 సీసీ సెగ్మెంట్‌లో అత్యధిక ఆదరణ పొందిన ఈ స్కూటర్‌లో ఇప్పుడు 'సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్'(ABS)ను ప్రవేశపెట్టింది. వాహనదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.., స్కూటర్ పెర్ఫామెన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ మార్పును తీసుకువచ్చినట్లు కంపెనీ చెబుతోంది. వినియోగదారులకు మరింత మెరుగైన ఆప్షన్స్ అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
ALSO READ : బజాజ్ కొత్త ప్లాన్ ! పల్సర్ బైక్స్‌లో బిగ్ ఛేంజ్..
అసలు ABS ఎందుకు అవసరమంటే.. ఇది అత్యవసర సమయాల్లో వాహనదారుడి ప్రాణాలను కాపాడుతుంది. సాధారణంగా వేగంగా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే చక్రాలు లాక్ అయిపోయి స్కూటర్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ABS వ్యవస్థ బ్రేక్ ప్రెజర్‌ను నియంత్రించి, వీల్ లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. దీనివల్ల బ్రేక్ వేసినప్పుడు కూడా వాహనంపై పట్టు కోల్పోకుండా.. తక్కువ దూరంలోనే సురక్షితంగా ఆగిపోతుంది. వర్షాకాలంలో తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఈ ఫీచర్ ఒక వరమని చెప్పొచ్చు.
ALSO READ : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరా..? బడ్జెట్ వల్ల వచ్చిన టాక్స్ రూల్స్ మార్పు గురించి తెలుసా..
సుజుకి యాక్సెస్ ఇప్పుడు రెండు సరికొత్త ఏబీఎస్ వేరియంట్లలో లభిస్తోంది. అందులో మొదటిది 'యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఏబీఎస్ ఎడిషన్'. దీని ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ లో రూ.92వేల 328గా నిర్ణయించారు. ఇది మెటాలిక్ మ్యాట్ బ్లాక్, పెర్ల్ గ్రేస్ వైట్ లాంటి 5 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక రెండవది మరింత మోడ్రన్ 'యాక్సెస్ రైడ్ కనెక్ట్ TFT ఏబీఎస్ ఎడిషన్'. దీని ధర రూ.98వేల 378గా ఉంది. ఇందులో టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో పాటు అదనపు ఫీచర్లు కొనుగోలుదారులను ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
ALSO READ : రాముడిగా మహేష్.. రెండు నిమిషాల సీన్‌కు ఆరు నెలల ట్రైనింగ్..
సేఫ్టీ పెరిగినప్పటికీ.. ఈ స్కూటర్ మైలేజీ, పికప్‌లో ఎటువంటి మార్పు ఉండదని సుజుకి స్పష్టం చేసింది. అంతేకాకుండా, కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం సుజుకి ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్ కూడా అందిస్తోంది. కేవలం 6.99 శాతం వడ్డీ రేటుతో.. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా టూవీలర్ లోన్ సౌకర్యం కల్పిస్తోంది. స్టైల్‌తో పాటు సేఫ్టీని కోరుకునే యువతకు ఈ సరికొత్త సుజుకి యాక్సెస్ ఏబీఎస్ వేరియంట్ ఒక అద్భుతమైన ఆప్షన్ గా నిలవనుంది.
