కేసీఆరే కాదు.. నేనూ జాతిపితనే! మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆరే కాదు.. నేనూ జాతిపితనే! మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాత్రమే కాదు, తాను కూడా తెలంగాణ జాతిపితనేనని అన్నారు. నల్లగొండలో పర్యటించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర కూడా ఉందని, కేసీఆర్ తో పాటు మిగతా వారు కూడా ఉద్యమకారులేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. 

తాను తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించా నని, పదవులకు రాజీనామాలు చేసి సర్వం కోల్పోయానని గుర్తుచేశారు. కేసీఆర్, కోమటిరెడ్డిలు ఎన్నటికీ జాతిపితలు కాలేరని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ కు పరాభవం తప్పదన్నారు.

సర్పంచ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పా ర్లమెంట్ ఎన్నికల్లో జరిగిందే మళ్లీ రిపీట్ అవుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. నల్లగొండ కార్పొరే షన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.