అమెజాన్ పింక్ స్లిప్స్.. వణికిపోతున్న ఉద్యోగులు, టార్గెట్ ఎవరంటే..?

అమెజాన్ పింక్ స్లిప్స్.. వణికిపోతున్న ఉద్యోగులు, టార్గెట్ ఎవరంటే..?

అమెజాన్ లో కోతలు మొదలయ్యాయి. ఒక్క వాషింగ్టన్ లోనే 2వేల 198 మందికి పింక్ స్లిప్ ఇచ్చేశారు. అమెజాన్ సంస్థ 2026లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు ఉంటాయని వార్న్ నివేదిక స్పష్టం చేసింది. ఈ కోతలు ఇప్పటికే ప్రకటిం చిన గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అమెజాన్ ప్రధాన కేంద్రంగా ఉన్న సియాటిల్ ప్రాంతంలోనే అత్యధిక ఉద్యోగ కోతలు జరగనున్నాయి. సాఫ్ట్‪వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ టీమ్లపై ఎక్కువ ప్రభావం పడింది. మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయిల్లోనూ ఉద్యోగాలు తగ్గించడంతో లీడర్షిప్ లేయర్లు తగ్గుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. 

ALSO READ : నిమిషాల్లో రూ.50వేల కోట్లు ఆవిరి..

ఏప్రిల్ 28 నుంచి జూన్ చివరి వరకు వాలంటరీ రిటైర్మెంట్స్ కొనసాగనున్నాయి. అంతర్గతంగా మరో విభాగానికి బదిలీ పొందిన ఉద్యోగులకు ఈ కోతలు వర్తించవని అమెజాన్ తెలిపింది. సంస్థలో నిర్మాణాత్మక మార్పులు, ఖర్చుల నియంత్రణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ వివరించింది.