LEADER Glimps: ‘పిల్లలందరికీ తండ్రులే హీరోలురా’.. మరో పవర్‌ఫుల్ ఎంట్రీకి సిద్ధమైన లెజెండ్ శరవణన్

LEADER Glimps: ‘పిల్లలందరికీ తండ్రులే హీరోలురా’.. మరో పవర్‌ఫుల్ ఎంట్రీకి సిద్ధమైన లెజెండ్ శరవణన్

ప్రముఖ వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ‘ది లెజెండ్‌’తో హీరోగా మారారు. ‘ఒక కామన్ మేన్ లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎలా ఎదిగాడనేది కథతో వచ్చి అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుడుకున్నాడు. ఈ క్రమంలోనే అతని పేరు ముందు లెజెండ్‌ అని ఫిక్స్ అయిపోయింది.

లేటెస్ట్గా లెజెండ్‌ శరవణన్‌ ‘లీడర్‌’ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘లీడర్’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

యాక్షన్ హైలైట్‌గా రూపొందిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. కంటైనర్లు మిస్ కావడం, వాటిని వెతుక్కుంటూ వెళ్లిన వ్యక్తికి హీరో అసలు రూపం తెలియడం వంటి సన్నివేశాలు కథపై క్యూరియాసిటీ కలిగించాయి. విలన్ భయపెట్టే ప్రయత్నాలకు ధీటుగా లెజెండ్ శరవణన్ ఇచ్చే ప్రతిస్పందన యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.

“అసలు ఎవడ్రా నువ్వు… ఏమైనా హీరో అనుకుంటున్నావా?” అని విలన్ ప్రశ్నించగా, “నీ యబ్బా అవునురా… పిల్లలందరికీ తమ తండ్రులే హీరోలురా” అనే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ గ్లింప్స్‌ను బట్టి ‘లీడర్’ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని, భావోద్వేగాలను, యాక్షన్ అంశాలను సమపాళ్లలో కలబోసిన కథగా రూపొందిందని స్పష్టమవుతోంది.