నీతికథ: రామచిలుక బడి.. ఆటవిక రాజ్యం మార్చేందుకు అరుదైన పాఠశాల

నీతికథ: రామచిలుక బడి.. ఆటవిక రాజ్యం మార్చేందుకు  అరుదైన పాఠశాల

అందమైన  అడవిలో  అనేక రకాల జంతువులు, పక్షులు  ఉండేవి.  మొదట్లో అడవిలో వున్న ఏనుగు, జిరాఫీ, సింహం, పులి, కుందేలు, నక్క, తాబేలు, రామచిలుకలు, కొంగలు, గుడ్లగూబలు మొదలైనవి  కలిసిమెలిసి జీవించేవి.  అయితే అడవికి రాజైన   సింహం అడవి నియమాలకు వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా అనేక జంతువులను వేటాడి తింటుండేది. సింహానికి సలహాదారుడిగా నక్క వ్యవహరించేది. నక్క మోసపు బుద్ధితో  చిన్న పెద్ద జంతువులను, పక్షులను సింహానికి ఆహారంగా అయ్యేటట్లు సహాయపడేది.

అయితే  రాను రాను అడవిలో  ప్రశాంతత లేకుండా పోయింది. పక్షులకు, జంతువులకు కునుకు మీద నిద్ర లేకుండా పోయింది. అడవిలో ఆటవిక రాజ్యం కలగడానికి  వాటి మధ్య ఐకమత్యం లేకపోవడమే కాకుండా  చదువు లేకపోవడం  కూడా ప్రధానంగా  కారణమని  రామచిలుక గ్రహించి  ఒక స్కూల్ పెట్టింది.. ఆ స్కూల్లో  పక్షులు, జంతువులు చేరాయి. సంగీతం,  నాట్యం,  నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తూ  ఉండేది . ఆ బడిలో  విద్య నేర్చుకోవడానికి  రెండు కొంగలు కూడా చేరాయి.  ప్రతినెల  మూడో శనివారం పాటలు, డ్యాన్స్  వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగేవి. 

అయితే చదువులో బద్దకంగా ఉండే కొంగలకు  చదవడం అన్నా,  రాయడం అన్నా చాలా    అయిష్టం గా ఉండేది. పైగా కొంగలకు  ప్రతి సబ్జెక్టులో డి గ్రేడు వచ్చేది. సమావేశంలో  ప్రిన్సిపాల్ గా ఉన్న రామచిలుక  విద్యలో వెనుక పడ్డ కొంగలను మందలించేది.  బాగా చదవాలని సూచించేది. కానీ ఎన్నిసార్లు చెప్పినా ప్రిన్సిపల్ మాటలను  పెడచెవిన పెట్టడమే కాకుండా  ఆ పాఠశాల లో ఆ రెండు కొంగలు  బాగా ఇబ్బందులు కలిగించేవి. వాటి ప్రవర్తన ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా పాఠశాల ఉనికికే ప్రమాదం అని గ్రహించిన రామచిలుక  ఆ రెండు కొంగలను బాగా మందలించింది.

దీంతో ఆగ్రహించిన కొంగలు  రామచిలుకను  చంపాలని కుట్రజేసాయి. ఒకరోజు ప్లాన్  ప్రకారం   ఆ కొంగలు రామచిలుక ఇంటికి వెళ్లి చంపడం జరిగింది. హాయిగా సాగిపోతున్న స్కూల్​ లో  విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనతో మిగిలిన జంతువులు,  పక్షులు చాలా బాధపడ్డాయి. పట్టుబడిన కొంగలకు  పోలీస్ ఎస్ఐ గా ఉన్న ఎలుగుబంటి  అరెస్టు చేసి కోర్టులో కొంగలను  హాజరు పరిచింది.  నేరం  నిరూపితం కావడంతో వాటికి కఠిన  యావత్ జీవ  కారాగార శిక్ష  పడింది.
-
 ‌‌‌‌‌‌కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు [email protected] కి మెయిల్​ చేయండి.